అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Meeting | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు, డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Revanth Reddy Meeting | డెలావర్‌లో అమలుచేస్తున్న పథకాలపై వివరణ

డెలావర్‌లో పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్‌రెడ్డికి గవర్నర్ మాట్ మేయర్ వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ (Telangana)తో పాటు డెలావర్ రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వానం పలికారు.
Revanth Reddy Meeting | తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్ అందజేత
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెలావర్ గవర్నర్ (Governor of Delaware)కు ‘తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్‌ను అందజేశారు. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
I had the pleasure of meeting the Governor of Delaware, Matt Meyer, along with the First Lady of Delaware, Lauren Meyer.
We had a constructive discussion on reforms in the health and education sectors. Governor Meyer shared insights into several initiatives implemented in… pic.twitter.com/hYFpIhle6l
— Revanth Reddy (@revanth_anumula) March 7, 2026
ఇది కూడా చదవండి..: Telangana Temple Attacks | ఆలయాలపై దాడులు ఆందోళనకరం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

