Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం

తెలంగాణ

Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం

పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది హెడ్ క్వార్టర్స్​లో ఉండటం లేదని, వారు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 3, 2026 9:00 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Revanth Reddy Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Warning | పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది హెడ్ క్వార్టర్స్​లో ఉండటం లేదని, వారు తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దు అని ఆదేశించారు.

Contents
  • Revanth Reddy Warning | చురుగ్గా పాల్గొనాలి
    • Revanth Reddy Warning | సౌర విద్యుత్​పై..
      • Revanth Reddy Warning | సంక్షేమ పథకాలకు ముఖ గుర్తింపు
      • బిల్లులు చెల్లించాలి

సీఎం రేవంత్​రెడ్డి మంగళవారం కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 డేస్ యాక్షన్ ప్లాన్ (99 Days action plan) అమలు చేయాలన్నారు. 10 రకాల థీమ్స్ తో 5 స్థాయిలలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ ఉండాలని ఆదేశింంచారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ స్థాయి, 16వ తేదీన మండల స్థాయి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారు. జూన్ 2న రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందన్నారు.

Revanth Reddy Warning | చురుగ్గా పాల్గొనాలి

వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్‌పర్సన్‌లు, కార్పొరేటర్లు, మేయర్‌లు 99 రోజుల కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని సీఎం సూచించారు. దీనిపై వారికి ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Revanth Reddy Warning | సౌర విద్యుత్​పై..

సౌర విద్యుత్ (Solar Power) వినియోగాన్ని ప్రోత్సహించాలని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ బోరు మోటార్​లను సోలార్ పంపు సెట్‌లతో భర్తీ చేయడం గురించి అవగాహన కల్పించాలన్నారు. కొత్త రేషన్ కార్డులు (New Ration cards), సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సభలలో ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు.

Revanth Reddy Warning | సంక్షేమ పథకాలకు ముఖ గుర్తింపు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు (Welfare Schemes) అర్హులకు చేరేలా ముఖ గుర్తింపును అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఆసరా పెన్షన్లలో ముఖ గుర్తింపు ద్వారా, మూడు లక్షల మంది అనర్హులైన లబ్ధిదారులను తొలగించారని చెప్పారు. రవాణా శాఖలో సంస్కరణలు అమలు చేయాలని సూచించారు. పాఠశాల బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.

బిల్లులు చెల్లించాలి

మధ్యాహ్న భోజన (MDM) ఏజెన్సీలు, కార్మికులకు నెలవారీ బిల్లులు ఆలస్యం లేకుండా క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. పిల్లలకు పోషకాహారం నిరంతరాయంగా సరఫరా అయ్యేలా ప్రణాళిక ఉండాలన్నారు. విద్యాసంస్థల్లో గంజాయి, మాదకద్రవ్యాలు, ఇ-సిగరెట్లు కనిపిస్తే పాఠశాలలు మరియు కళాశాలలు బాధ్యత వహించాలన్నారు.

దీనిని కూడా చదవండి : Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు

KA Paul Iran Israel War | వారంలో యుద్ధం ముగుస్తుంది : కేఏ పాల్
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
Hyderabad Flood Control | నగరంలో వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు : హైడ్రా క‌మిష‌న‌ర్‌
Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు
Hyderabad Pollution Free | కాలుష్య రహితంగా హైదరాబాద్​ : సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:99 days action plandistrict collectors Telanganagovernance reforms IndiaRevanth Reddy warningsolar power promotionTelangana CM review meetingTelangana welfare schemes
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Holi Boy Drowned | Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
Next Article Kavitha Arrest Narsingi Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?