అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RI Caught by ACB | మరో అవినీతి అధికారి ఏసీబీ (ACB)కి చిక్కాడు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు చేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సెడంక శ్రీమాన్ (RI Sriman) రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కరీంనగర్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
RI Caught by ACB | భూమి సర్వే కోసం..
అంతర్గాం (Anthargam) మండలంలోని ఓ మహిళ భూమికి సంబంధించి భూ భారతి చట్టం-2025 కింద క్షేత్రస్థాయి విచారణ జరిపి, తహసీల్దార్‌కు నివేదిక సమర్పించడం కోసం ఆర్‌ఐ శ్రీమాన్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలి కుమారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు ఫిర్యాదుదారుడు ఆర్ఐకి లంచం ఇస్తుండగా.. వల పన్ని పట్టుకున్నారు.
RI Caught by ACB | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కోసం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని కోరారు. ఏసీబీ తెలంగాణను వాట్సాప్ (9440446106), వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి : Telangana Heatwave | హీట్‌వేవ్ అలెర్ట్.. మండనున్న ఎండలు
