అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rinku Singh Father | టీమిండియా (Team India) యువ బ్యాటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖంచంద్ర సింగ్ స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు.
గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రి (Yatharth Hospital)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం గత కొన్ని రోజులుగా అత్యంత విషమంగా మారింది. డాక్టర్ల పర్యవేక్షణలో వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్న ఖంచంద్ర సింగ్‌కు నిరంతరం రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ (CRRT) అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక చివరకు ఆయన మృతి చెందారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ విషాదాన్ని తీవ్రంగా భావిస్తున్నారు.
Rinku Singh Father | శోక సంద్రంలో కుటుంబం..
టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో భారత జట్టుకు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉన్న రింకూ సింగ్‌కు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందగానే జట్టును వదిలి హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో తండ్రి వద్దే ఉన్న రింకూ, ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడినట్టు భావించి జట్టుతో మళ్లీ కలిశాడు. మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం (Chidambaram Stadium)లో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు రింకూ హాజరు కాలేదు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్‌కు ఆయన అందుబాటులో ఉంటారా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కీలక మ్యాచ్‌కు ముందే జట్టుతో చేరిన రింకూకు ఆ మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు.

Rinku Singh Father | రింకూ సింగ్ తండ్రి మృతి
మ్యాచ్ అనంతరం ఆసుపత్రి నుంచి తండ్రి మృతి వార్త అందగానే రింకూ సింగ్ మళ్లీ తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు బయలుదేరాడు. 28 ఏళ్ల రింకూ తన కష్టపడి సాధించిన క్రికెట్ ప్రయాణంలో తండ్రి మద్దతు ఎంతో ఉందని గతంలో పలు సందర్భాల్లో వెల్లడించాడు. రింకూ సింగ్ (Rinku Singh) కుటుంబానికి క్రికెట్ ప్రపంచం నుంచి సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు ధైర్యం చెప్పుతూ, కుటుంబానికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి

