Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

జాతీయంతాజా వార్తలు

RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. వైసీపీ ఫైర్‌బ్రాండ్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తమిళ రాజకీయాల్లో సందడి చేస్తూ, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్కు బహిరంగ మద్దతు ప్రకటించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 11:52 ఉద.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
RK Roja Tamil Nadu
RK Roja Tamil Nadu

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RK Roja Tamil Nadu | తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేయగా, ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)కి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా తమిళ రాజకీయాల్లో ఆకస్మికంగా ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

Contents
  • RK Roja Tamil Nadu | ఏపీ రాజ‌కీయాల గురించి కూడా..
    • RK Roja Tamil Nadu | తమిళనాడులో డీఎంకే తరపున ప్రచారం

మార్చి 1న డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (Tamilnadu CM M.K. Stalin) పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రోజా, ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. స్టాలిన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని ఆమె కొనియాడారు.

RK Roja Tamil Nadu | ఏపీ రాజ‌కీయాల గురించి కూడా..

ప్రత్యేకంగా మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రతినెలా వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1000 జమ చేసే పథకాన్ని ఆమె ప్రశంసించారు. ఇది మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలకమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇటీవల మహిళల ఖాతాల్లో ఒకేసారి రూ.5000 జమ చేయడం ద్వారా ప్రభుత్వ నిబద్ధత స్పష్టమైందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తమైందని రోజా తెలిపారు. కూలి పనులకు వెళ్లే మహిళలు, విద్యార్థినులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రస్తావిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మహిళలకు నేరుగా నగదు అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి కూడా జమ కాలేదని ఆరోపించారు.

RK Roja Tamil Nadu
RK Roja Tamil Nadu

RK Roja Tamil Nadu | తమిళనాడులో డీఎంకే తరపున ప్రచారం

స్టాలిన్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని రోజా వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న స్టాలిన్‌ను తమిళ ప్రజలు భారీ మెజారిటీతో మళ్లీ గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే, తమిళనాడులో డీఎంకే తరపున ప్రచారం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాబోయే ఎన్నికల్లో ఈ మద్దతు ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి

March 25 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Jeffrey Epstein Documentary | బాలికల మాంసం ముద్దలపై ఎప్‌స్టీన్ దుష్కృత్యాలు.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న భారీ సెక్స్​ కుంభకోణం..
March 19 Horoscope | కొత్త తెలుగు సంవత్సరంలో కొత్త కెరీర్.. ఉగాది శుభవేళ కష్టానికి తగిన గుర్తింపు.. ఈ రాశుల వారి కల నెరవేరే సుముహూర్తం ఇదే!
Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
TAGGED:Andhra Pradesh politicsCM Nara Chandrababu NaiduDMK political newsMK Stalin election campaignRK Roja Tamil NaduRoja fire on ChandrababuSouth India political updatesStalin welfare schemesTamil Nadu Assembly ElectionsYSR Congress Party
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Motorola Edge 70 Fusion Motorola Edge 70 Fusion | మోటోరోలానుంచి మరో ఫోన్.. 6న లాంచ్ చేయనున్న కంపెనీ
Next Article Stock Market Crash Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?