
అక్షరటుడే, ఇందూరు: Robo Fest Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యా ర్థుల రోబోటిక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో ‘టెక్టానికా 2026’ పేరిట రోబో ఫెస్ట్ నిర్వహిస్తున్నారు.
కార్యక్రమాన్ని కేవోస్ డైరెక్టర్ రామోజీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ విద్యా సంస్థలకు చెందిన ప్రగతినగర్ క్యాంపస్, సుభాష్ నగర్ క్యాంపస్, KOS I 20 క్యాంపస్‌ల విద్యార్థులు సుమారు 350కి పైగా ప్రాజెక్టులు రూపొందించడం అభినందనీయమన్నారు.
Robo Fest Nizamabad | నూతన పద్ధతుల్లో శిక్షణ
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా గత కొన్ని సంవత్సరాలుగా రోబో ఫెస్ట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని డైరెక్టర్ తేజస్విని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించడాన్ని అభినందించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే రోబోటిక్స్‌పై నూతన పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
Robo Fest Nizamabad | రాబోయే రోజుల్లో రోబోటిక్స్‌దే ప్రధాన పాత్ర
కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ రోబో ఫెస్ట్‌లో విద్యార్థులు చాలా ఉత్సహంగా పాల్గొన్నారని తెలిపారు. రానున్న పదేళ్లలో రోబోటిక్ట్స్ అనేది మన నిత్య జీవితంలో ప్రముఖ పాత్ర వహించనుందని పేర్కొన్నారు. ఇందుకోసమే కేవోఎస్ ఆధ్వర్యంలో ఇప్పటి నుంచే విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అందుకే పాఠశాల స్థాయిలోనే రోబోటిక్స్‌ను ప్రవేశపెట్టామన్నారు. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం రోబోటిక్స్‌పై టెక్టానికా నిర్వహిస్తున్నామని చెప్పారు.
Robo Fest Nizamabad | అద్భుత ప్రదర్శన..
నూతన టెక్నాలజీకి అనుగుణంగా 3డీ డిజైన్లు రూపొందించడం, సెన్సా ర్లు, గేమ్స్ కోడింగ్ వంటివి అద్భుతంగా చేశారని విద్యా ర్థుల్ని డైరెక్టర్లు అభినందించారు. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మొదటిరోజే పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, ప్రజలు హాజరై విద్యా ర్థుల ప్రతిభను చూసి అబ్బురపడ్డారు.
ఈ ఫెస్ట్‌లో పాఠశాల డైరెక్టర్లు రజినీకాంత్, రాజా, రామోజీరావు, తేజశ్వి ని, ప్రిన్సిపాళ్లు చందశ్రేఖర్, గిరిధర్ రాజ్, రవికాంత్, సుచరిత, వైస్ ప్రిన్సిపాళ్లు భావన, భూపాల్, కో–ఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.







ఇది కూడా చదవండి: Telangana Inter Results | ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్

