అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Former MLA Pilot Rohit Reddy) వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ (Moinabad Farmhouse)లో డ్రగ్స్ పార్టీ, మాదకద్రవ్యాల వినియోగంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మొయినాబాద్‌లోని రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి డ్రగ్స్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. పోలీసుల దాడి సందర్భంగా ఓ వ్యక్తి కాల్పులు సైతం జరిపాడు. ఘటన స్థలంలో పోలీసులు డ్రగ్స్‌తో పాటు గన్ను స్వాధీనం చేసుకున్నారు.
Rohit Reddy Drugs Case | రోహిత్‌రెడ్డికి పాజిటివ్
పార్టీ మొత్తం 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో మాజీ ఎమ్మెల్యే రోహిర్రెడ్డితో పాటు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి పాజిటివ్ వచ్చింది. ఎంపీ మహేశ్ సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.

Rohit Reddy Drugs Case | వేటు వేస్తాం
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డ్రగ్స్ కేసులో దొరకడంతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ (KCR) చర్యలు చేపట్టారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు వేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం

