Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!

తెలంగాణతాజా వార్తలు

Rohith Reddy Farmhouse Case | మరో వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. అసైన్డ్​ ల్యాండ్​లో ఫామ్​హౌస్​ నిర్మాణం!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మొయినాబాద్​ ఫామ్​హౌస్​ డ్రగ్స్​ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే  మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

Naresh chandan
Last updated: మార్చి 20, 2026 12:31 సా.
Naresh chandan
7 రోజులు ago
Share
Rohith Reddy Farmhouse Case

అక్షరటుడే, హైదరాబాద్: Rohith Reddy Farmhouse Case | తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మొయినాబాద్​ ఫామ్​హౌస్​ డ్రగ్స్​ కేసు (Moinabad Farmhouse Drugs Case)లో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే  మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసును ఎదుర్కొంటున్న రోహిత్​ .. తాజాగా ఫామ్‌హౌస్ భూమి వ్యవహారంతో మరోసారి వార్తాల్లో నిలిచారు.

Contents
  • Rohith Reddy Farmhouse Case | అసైన్డ్ ల్యాండ్‌లో ఫామ్ హౌస్..
    • Rohith Reddy Farmhouse Case | ఇప్పటికే డ్రగ్స్ కేసు..
      • Rohith Reddy Farmhouse Case | SIT విచారణ

Rohith Reddy Farmhouse Case | అసైన్డ్ ల్యాండ్‌లో ఫామ్ హౌస్..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ పరిధిలో ఉన్న సర్వే నంబరు 177/33లో సుమారు రెండు ఎకరాల భూమిలో సదరు ఫామ్ హౌస్‌ నిర్మించారు. కాగా, ఈ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు కీలక అంశాలను గుర్తించారు. ఈ ల్యాండ్​ను అసలు రికార్డుల్లో “అంతంగారి జంగయ్య” పేరుతో ఉన్న అసైన్డ్ భూమిగా అధికారులు గుర్తించినట్లు సమాచారం.

కాగా, అదే భూమిలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫౌమ్​హౌస్ (Rohith Reddy Farmhouse)​ను తన తండ్రి విఠల్ రెడ్డి పేరుతో నిర్మించి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిసింది. అసైన్డ్ భూమిని ఇతరులకు బదిలీ చేయడం కానీ, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం కానీ చట్ట విరుద్ధం.

ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ భూమి ఎలా బదిలీ అయింది? ప్రస్తుతం ఎలాంటి పత్రాలు ఉన్నాయి? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. అవసరమైతే ఫామ్ హౌస్‌ను సీజ్ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

Rohith Reddy Farmhouse Case | ఇప్పటికే డ్రగ్స్ కేసు..

ఇటీవలే ఈ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కేంద్రంగా నిలిచింది. పోలీసులు నిర్వహించిన దాడిలో మాజీ ఎమ్మెల్యేతో సహా పలువురు డ్రగ్స్ పట్టుబడ్డారు. దీనికితోడు పోలీసుల దాడి సమయంలో గన్ ఫైరింగ్ జరగడం తీవ్ర సంచలనంగా మారింది. వరుస వివాదాలు బీఆర్ఎస్‌ (BRS)కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావొచ్చని  పొలిటికల్​ విశ్లేషకులు భావిస్తున్నారు.

Rohith Reddy Farmhouse Case | SIT విచారణ

ఫామ్ హౌస్ డ్రగ్స్​ వినియోగం ఘటనకు రాజకీయ కోణం ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాల్పుల ఘటనలో ప్రేరేపణ ఆరోపణలు సైతం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం

 

Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Karimnagar SI Suicide | కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
TAGGED:BRSMoinabad Farmhouse Drugs CaseRangareddy DistrictRohith Reddy FarmhouseRohith Reddy Farmhouse CaseSpecial Investigation Team
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Budget 2026  Telangana Budget 2026 | రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్​
Next Article ATC Student Scholarship ATC Student Scholarship | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. వారికి నెలకు రూ.2 వేల స్కాలర్​షిప్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?