Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rotten meat storage | కోల్డ్​ స్టోరేజీ నిండా కుళ్లిన మాంసం.. షాకైన అధికారులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Rotten meat storage | కోల్డ్​ స్టోరేజీ నిండా కుళ్లిన మాంసం.. షాకైన అధికారులు

హైదరాబాద్తెలంగాణ

Rotten meat storage | కోల్డ్​ స్టోరేజీ నిండా కుళ్లిన మాంసం.. షాకైన అధికారులు

హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ ఎత్తున కుళ్లిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 10, 2026 7:34 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
Rotten meat storage

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rotten meat storage | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి భారీ ఎత్తున కుళ్లిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్‌లోని సలామి ఇండస్ట్రీస్​లో శుక్రవారం పోలీసులు, జీహెచ్​ఎంసీ (GHMC) అధికారులు దాడులు చేశారు.

Contents
  • Rotten meat storage | కేసు నమోదు
    • Rotten meat storage | ఏం తింటున్నాం..

మదీనా కాలనీలోని సలామీ కోల్డ్ స్టోరేజ్ కేంద్రంలో అపరిశుభ్ర పరిస్థితులు బయటపడ్డాయి. కుళ్లిన మాంసం, మేక తలలు, కాళ్లు భారీ పరిమాణంలో వ్యర్థాలు అసురక్షిత పరిస్థితులలో నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. సంచుల్లో నింపిన టన్నుల కొద్ది మాంసాన్ని చూసి షాక్​ అయ్యారు. ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Rotten meat storage | కేసు నమోదు

బాలాపూర్​ కేంద్రంగా కుళ్లిన మాంసం దందా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మొత్తం ఐదు కోల్డ్​ స్టోరేజీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఒకదానిపై దాడి చేయగా.. భారీ మొత్తంలో కుళ్లిన మాంసం లభించడంతో అధికారులు ఫోకస్​ పెంచారు. నిందితులపై కేసు నమోదు చేశారు. అన్ని గోదాంలపై దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మాంసాన్ని నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Rotten meat storage | ఏం తింటున్నాం..

హైదరాబాద్​లో ఇటీవల పోలీసులు దాడుల్లో భారీగా కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు లభ్యం అవుతున్నాయి. పాలు, నూనె, మద్యం ఇలా అన్నింటిని కల్తీ చేస్తున్నారు. మరోవైపు కుళ్లిన మాంసం, కుళ్లిన బిర్యానీలు విక్రయిస్తున్నారు. దీంతో నగర ప్రజలు ఇన్ని రోజులుగా తాము ఏం తింటున్నామని ఆందోళన చెందుతున్నారు. అసలు ఏది, కల్తీ ఏదో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కల్తీ చేసే వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.

#Hyderabad:

Major #foodsafety violation busted in #Balapur

Joint raids by Balapur Police and @GHMCOnline officials at a #Salami #coldstorage facility in #MadinaColony exposed shocking #unhygienic conditions.#Rottenmeat, #goatheads, and large quantities of waste were found… pic.twitter.com/bGvgglYMLE

— NewsMeter (@NewsMeter_In) April 10, 2026

ఇది కూడా చదవండి : RTC Employees DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. డీఏ పెంచిన ప్రభుత్వం

Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
Jeevan Reddy Targets Revanth Reddy | మార్పు రావాలి.. రేవంత్​ రెడ్డి పోవాలనే నినాదం వచ్చింది: జీవన్​రెడ్డి
Mahipal Reddy BRS | ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి బీఆర్​ఎస్​లోకి వచ్చినట్టేనా!
Registration Server Issue | రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు
KTR New York Speech | న్యూయార్క్​ బిజినెస్​ కాన్ఫరెన్స్​లో ప్రసంగించిన కేటీఆర్​
TAGGED:cold storage raidfood adulterationFood SafetyGHMCHyderabad newspolice raidrotten meatspoiled meat
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy PG Results | Kamareddy PG Results | కామారెడ్డి ప్రభుత్వ కళాశాల పీజీ ఫలితాల విడుదల
Next Article godrej గోద్రెజ్ ప్రామిస్.. అన్ని హోమ్ అప్లయన్సెస్‌పై 5 ఏళ్ల ఉచిత సమగ్ర వారంటీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?