అక్షర టుడే, ఇందూరు: RSS Ugadi Utsavam | రాష్ట్రీయ స్వయం సేవక్ ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19న ఉగాది మహోత్సవం (Ugadi celebrations) నిర్వహిస్తున్నట్లు(RSS Indur) నగర కార్యవాహ అర్గుల సత్యం తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్లో (Vinayak Nagar Indur) ఉన్న బస్వాగార్డెన్లో (Baswa Garden event) సాయత్రం 6 గంటలకు ఉంటుందన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పుట్టినరోజు కూడా ఉగాది రోజు కావడం ప్రత్యేకమైనదిగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యుడు జక్కరవి, ప్రధాన వక్తగా తెలంగాణ ప్రాంత సహా బౌద్ధిక్ ప్రముఖ, ఇందూర్ విభాగ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ హాజరవుతారని పేర్కొన్నారు.
RSS Ugadi Utsavam | ఇందూరు ఎంతో చారిత్రక నేపథ్యం..
ఇందూరు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నగరమని, ఇక్కడి హిందువులు (Hindu Organization) ఎంతో ధర్మనిష్ట కలిగిన వారని అర్గుల సత్యం అన్నారు. సంఘం ప్రారంభమై వందేళ్లు పూర్తికావడం.. ఇందూరులో మొట్టమొదటి సంఘ శాఖ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి కావడం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి, ధర్మనిష్ట, వ్యక్తిగత శీలం, జాతీయ శీలం, సంస్కారం, సంస్కృతి పరిరక్షణ అనే ఎన్నో సుగుణాలను శాఖ ఆధారంగా స్వయంసేవకులు ఉపాసన చేస్తున్నారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ శాఖ అంటే సమాజ సంస్కారాలకు కేంద్ర బిందువు అని, ఏ రాజకీయ అవసరాలు లేవని స్పష్టం చేశారు.
RSS Ugadi Utsavam | వందేళ్ల ప్రయాణంలో..
వందేళ్ల ప్రయాణంలో (RSS event Telangana) దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆర్ఎస్ఎస్ (Telangana RSS) విస్తరించిందని, కార్యకర్తల సంఖ్య పెరిగిన ప్రతిచోట సమాజంలో సౌభ్రాతృత్వం, దేశభక్తి పెరిగి ఆయా ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్ర పోరాటంలో (Hindu Organization) పాల్గొన్న వారు కూడా సంఘ కార్యం ఆవశ్యకతను గుర్తించారని తెలిపారు. సంఘస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ భారతదేశంలో(Hedgewar birth anniversary) స్వాతంత్రం కోల్పోవడానికి మూల కారణమైన అసంఘటిత హిందూ సమాజాన్ని (cultural events India) సంఘటితంగా చేయడం మాత్రమే దీనికి శాశ్వతమైన పరిష్కారమని గుర్తించారని చెప్పారు. అందుకే ఆయన నిత్య శాఖ అనే మూలమంత్రాన్ని సంఘ యొక్క సిద్ధాంత భూమికగా తయారు చేశారన్నారు.
ఇది కూడా చదవండి: Drugs Test | డ్రగ్స్ టెస్టులకు నేను రెడీ : కేటీఆర్

