Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​

హైదరాబాద్తెలంగాణ

RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​

హైదరాబాద్​లో ఏసీ, డీలక్స్​ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. సొంత వాహనాలకు బదులుగా బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.

Srinivas kolluri
Last updated: మార్చి 25, 2026 3:53 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
RTC Bus Discount

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Bus Discount | హైదరాబాద్​ (Hyderabad) నగర ప్రజలకు ఆర్టీసీ గుడ్​ న్యూస్ చెప్పింది. నగర పరిధిలో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ అమలు చేస్తున్నట్లు తెలిపింది.

Contents
  • RTC Bus Discount | ఇంధనాన్ని ఆదా చేయాలి
    • RTC Bus Discount | ట్రాఫిక్​ సమస్యకు పరిష్కారం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్​, డీజిల్​ దొరకదని పుకార్లు వ్యాపించాయి. వాహనదారులు బుధవారం ఉదయం నుంచి పెట్రోల్​ బంక్​లకు పరుగులు తీశారు. ఫలితంగా అనేక బంక్​ల్లో స్టాక్​ అయిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు బంక్​ల వద్ద బారులు తీరాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆర్టీసీ (TGS RTC) శుభవార్త చెప్పింది. పెట్రోల్‌ కష్టాలు ఎందుకు దండగ, ఆర్టీసీ బస్సులు ఉండగా అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. బంకుల వద్ద పెట్రోల్​ కోసం బారులు తీరొద్దని, సురక్షితంగా బస్సులో ప్రయాణించాలని ఆయన సూచించారు.

RTC Bus Discount | ఇంధనాన్ని ఆదా చేయాలి

ప్రస్తుతం చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దేశీయంగా ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. ఫలితంగా నష్టాలను ఆయా చమురు సంస్థలు భరిస్తున్నాయి. అయితే దిగుమతుల కోసం దేశం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో ఇంధనం ఆదా చేయడం ఎంతో అవసరం. ఇందులో భాగంగా వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను వినియోగిస్తే పెట్రోలు భారం ప్రజలకు అటు ప్రభుత్వానికి తప్పనుంది. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులను వినియోగించాలని ఎండీ నాగిరెడ్డి (RTC MD) సూచించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని తెలిపారు.

RTC Bus Discount | ట్రాఫిక్​ సమస్యకు పరిష్కారం

నగరంలో ట్రాఫిక్​ సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో వ్యక్తిగత వాహనాలకు బదులుగా ఆర్టీసీ బస్సులను వినియోగిస్తే.. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గనుంది. దీంతో ట్రాఫిక్​ తప్పలతో పాటు కాలుష్యం కూడా తగ్గనుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఈ క్రమంలో ఏసీ బస్సుల్లో 30శాతం రాయితీ ఇవ్వడంతో టికెట్ భారీగా తగ్గనున్నాయి. దీంతో ఆ బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి : Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!

Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ACB Bribery Arrest | పోస్టుమార్టం రిపోర్ట్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన హోంగార్డు
Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​
Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:ac bus offerbus fare discountfuel crisis updateHyderabad transport newspublic transport indiartc bus discount
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Indiramma Houses Role | Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
Next Article BLO Absence Issue | BLO Absence Issue | బీఎల్​వోల గైర్హాజరుపై కలెక్టర్​ ఆగ్రహం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?