అక్షరటుడే, బాన్సువాడ: Rudrur Road Accident | నిజామాబాద్ జిల్లా (Nizamabad District) రుద్రూర్ గ్రామ శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Rudrur Road Accident | ఆర్టీసీ బస్సు.. లారీ ఢీకొనడంతో..
ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
Rudrur Road Accident | కామారెడ్డి జీజీహెచ్‌కు..
తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో రుద్రూర్ (Rudrur) పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఇది కూడా చదవండి..: BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకుల ముందస్తు అరెస్ట్

