అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rupee Falls Against Dollar | డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోయింది. ప్రస్తుతం ఒక డాలర్‌కు 93.20 వద్ద ట్రేడింగ్ అవుతోంది. పశ్చిమాసియా సంఘర్షణ మధ్య గ్రీన్ బ్యాక్ మరింత బలపడడం, ఎఫ్ఐఐ అవుట్ ఫ్లోలతో రూపాయి బలహీనం అవుతోంది.
ఇరాన్ యుద్ధం (Iran War) నేపథ్యంలో పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి, ముడిచమురు ధరల ఒత్తిడితో శుక్రవారం రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 93.12 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాక దేశీయ కరెన్సీ రూపాయి నష్టాలు దాదాపు 2 శాతానికి చేరాయి. ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయాలు, ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి-ద్రవ్యోల్బణ సమతుల్యతను ప్రభావితం చేస్తూ దానికి ముప్పుగా కొనసాగుతున్నాయి. కరెన్సీ బలహీనపడినప్పటికీ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic Equity Markets) కోలుకున్నాయి.
Rupee Falls Against Dollar | తగ్గిన చమురు ధరలు
గల్ఫ్ (Gulf)లోని ప్రధాన ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో గురువారం చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 120 డాలర్లకు పెరిగాయి. అయితే శుక్రవారం కొంతమేర దిగి వచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.39% వరకు పడిపోయి, ఇంట్రాడే కనిష్టంగా బ్యారెల్‌కు 104.96 డాలర్లకు చేరింది. అదే సమయంలో యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 3.22 శాతం తగ్గి 92.47 డాలర్లకు పడిపోయింది. అయినా ముడి చమురు ధరలు అధికంగానే ఉన్నాయి.
Rupee Falls Against Dollar | ఎఫ్ఐఐల అమ్మకం
పెరుగుతున్న చమురు ధర (Oil Price)లపై ఆందోళనల కారణంగా విదేశీ పెట్టుబడిదారులు మార్చి నెలలో ఇప్పటివరకు భారతీయ ఈక్విటీల నుండి 8 బిలియన్ డాలర్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. ఇది జనవరి 2025 తర్వాత ఒకే నెలలో జరిగిన అతిపెద్ద నిధుల తరలింపు కావడం గమనార్హం. దీంతో రూపాయి ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉంది. ఇంధన ధరలు నిరంతరం పెరగడం భారతదేశ వృద్ధిపై భారం మోపి, ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Egypt Fuel Crisis | ఈజిప్ట్‌లో ఇంధన సంక్షోభం.. దుకాణాలు త్వరగా మూసేయాలని ఆదేశం

