Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Russia Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలి 29 మంది మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Russia Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలి 29 మంది మృతి

అంతర్జాతీయం

Russia Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలి 29 మంది మృతి

రష్యాకు చెందిన సైనిక రవాణా విమానం Antonov An-26 క్రిమియాలో కొండను ఢీకొని కుప్పకూలడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 10:21 ఉద.
Srinivas Kolluri
3 గంటలు ago
Share
Russia Plane Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Russia Plane Crash | రష్యా (Russia)కు చెందిన సైనిక రవాణా విమానం Antonov An-26 ఘోర ప్రమాదానికి గురైంది. క్రిమియా ప్రాంతంలో ఈ విమానం కొండను ఢీకొని కుప్పకూలడంతో విమానంలో ఉన్న మొత్తం 29 మంది మృతి చెందారు. మృతుల్లో 23 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నట్లు రష్యా రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

Contents
  • Russia Plane Crash | దాడి కాదు.. సాంకేతిక లోపమే
    • Russia Plane Crash | గత ప్రమాదాలు కూడా ఇదే మోడల్‌తో

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో విమానం అకస్మాత్తుగా సిగ్నల్స్ కోల్పోయింది. అనంతరం క్రిమియాలోని పర్వత ప్రాంతాన్ని ఢీకొని కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ, అప్పటికే అందరూ మృతి చెందినట్లు నిర్ధారించారు.

Russia Plane Crash | దాడి కాదు.. సాంకేతిక లోపమే

ఈ ప్రమాదంపై స్పష్టత ఇస్తూ రష్యా రక్షణ శాఖ (Russian Ministry of Defense), విమానంపై ఎలాంటి దాడి జరిగిన ఆనవాళ్లు లేవని తెలిపింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించామని పేర్కొంది. పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. Antonov An-26 విమానాలు 1969 నుంచి సేవలందిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా ఈ మోడల్‌కు చెందిన విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Russia Plane Crash | గత ప్రమాదాలు కూడా ఇదే మోడల్‌తో

2022: ఉక్రెయిన్లోని జపోరిజ్జియా ప్రాంతంలో ఏఎన్-26 కుప్పకూలి ఒకరు మృతి
2020: ఈశాన్య ఉక్రెయిన్‌లో శిక్షణా విమానం కూలి 27 మందిలో 26 మంది మృతి
2020: దక్షిణ సూడాన్లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి
2017: కోట్ డి ఐవరీలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

ఈ వరుస ఘటనలు పాత విమానాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

క్రిమియా (Crimea)లో జరిగిన ఈ తాజా ప్రమాదం మరోసారి విమాన భద్రతపై చర్చకు దారితీసింది. సాంకేతిక లోపాలపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Iran warning employees | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయా.. అమెరికన్ కంపెనీల ఉద్యోగులకు ఇరాన్ హెచ్చరిక!

Dubai Iran Attacks | దుబాయిలో చిక్కుకున్న పలువురు భారతీయులు.. భయంగా ఉందన్న పీవీ సింధు
Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
Pakistan Fuel Crisis | ఉద్యోగుల జీతాల్లో కోత.. పాఠశాలలకు సెలవులు.. పాక్​ కీలక నిర్ణయాలు
Trump Iran War Comments | యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు
BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన
TAGGED:Antonov An-26CrimeaRussiaRussia Plane CrashRussian Ministry of Defense
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Commercial LPG Price Hike Commercial LPG Price Hike | చమురు ధరల దెబ్బ: కమర్షియల్ LPG సిలిండర్‌పై భారీ పెంపు.. రూ. 2,000 దాటిన ధరలు
Next Article Market Recovery Bonus Fake Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస్​’.. ఉత్త ఫేక్ న్యూస్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?