అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Bharosa Funds | రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతాంగానికి ఇది శుభవార్త. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను (Rythu Bharosa Funds) విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం నిర్వహించిన సభలో తొలి విడతగా రూ.3,590 కోట్లు విడుదల చేశారు.
Rythu Bharosa Funds | రైతులకు పెట్టుబడి సాయంగా..
రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. పథకం కింద రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు గాను.. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇందులో తొలి విడతగా రూ.3,590 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
Rythu Bharosa Funds | ఒక ఎకరం వరకు సాయం అందేలా..
తొలి విడతలో భాగంగా ఒక ఎకరం వరకు సాయం అందేలా రూ.3,590 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులు ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు.. అటు నుంచి రైతులకు చేరనున్నాయి. ఆదివారం సెలవు కావడంతో అన్నదాతల ఖాతాల్లో సోమవారం జమ కానున్నాయి.
అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు…
— Revanth Reddy (@revanth_anumula) March 22, 2026
ఇరవై రోజుల్లో రెండో విడత
ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. మూడో విడతలో రూ.2,760 కోట్లు సాయం అందించనుంది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉంది. 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ భూములు ఉన్నాయి.
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
రైతు భరోసా విడుదలకు ముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రూ.300 కోట్ల వ్యయంతో 62 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఈ పరిశ్రమ నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా రూ.80 కోట్లతో పామాయిల్ రిఫైనరీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇది కూడా చదవండి..: Street Dog Attack | చిన్నారులపై వీధి కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్.. హైదరాబాద్‌కు తరలింపు

