అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Bharosa Issue | రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. రైతు భరోసా పడటంతో హర్షం వ్యక్తం చేయాల్సిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం రైతు భరోసాకు నిధులు విడుదల చేసి విషయం తెలిసిందే. తొలి విడతగా రూ.3,590 కోట్లు విడుదల చేశారు. ఎకరంలోపు ఉన్న రైతులకు మొదట డబ్బులు జమ చేస్తామని చెప్పారు. 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ చివరి నాటికి మూడో విడతలో రైతు భరోసా విడుదల చేస్తామని తెలిపారు. మొత్తం రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో వేస్తామన్నారు. సోమవారం ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.
Rythu Bharosa Issue | ఆందోళనలో రైతులు
రైతుల ఖాతాలో డబ్బులు జమ అయినట్లు బ్యాంక్ నుంచి మెసెజ్‌లు వస్తున్నాయి. అయితే ఎకరంపైన భూమి ఉన్న వారికి రెండో విడతలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఎన్ని ఎకరాల భూమి ఉన్న రూ.6 వేలు మాత్రమే ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు ఎకరాలుంటే రూ.12 వేలు జమ కావాలి. కానీ రూ.6 వేలు జమ అయ్యాయి. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఎక్కువ భూమి ఉన్న వారికి కూడా రూ.6 వేలు వేయడం గమనార్హం. దీంతో మిగతా డబ్బులు వస్తాయా.. రావా అని రైతులు చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..: Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

