అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sadabainama Application | సాదాబైనామా దరఖాస్తులపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించారు.
శాసనమండలిలో సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత రాష్ట్ర ప్రభుత్వం (State Government) సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందన్నారు. కానీ 2020 ఆర్.ఓ.ఆర్ చట్టంలో వాటి పరిష్కార మార్గాన్ని చూపలేదన్నారు.
Sadabainama Application | 9 లక్షలకు పైగా దరఖాస్తుదారులకు లబ్ధి
ఆర్ఓఆర్ చట్టం (ROR Act)లోని కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధన కారణంగా.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పొంగులేటి వివరించారు. దీంతో ఇకపై కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకోసం జీవో 76 (G.O. 76) విడుదల చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో పెండింగ్‌లో ఉన్న తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనుందన్నారు.
Sadabainama Application | ‘ధరణి’ లోపాలను ఆసరాగా చేసుకుని..
ధరణి పోర్టల్ (Dharani Portal)లో గల లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి తెలిపారు. మీ-సేవ నిర్వాహకులతో కలిసి రూ. 3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారని చెప్పారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేయిస్తున్నామని పేర్కొన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షింబోమని వెల్లడించారు. త్వరలో ‘భూ భారతి’ పోర్టల్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Lok Sabha Seats Increase | కేంద్రం కీలక నిర్ణయం.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు

