అక్షరటుడే, భీమ్‌గల్: Sai Baba Temple Bhakti | వేల్పూర్ మండల (Velpur Mandal) కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనులపండువగా జరిగాయి. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులు బాబా పల్లకీని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
భజన బృందాల సంకీర్తనలు, కోలాటాల మధ్య పల్లకీసేవ భక్తి పారవశ్యంలో సాగింది. శివాలయంలో అర్చకులు బోనగిరి గంగాధర్ ఆధ్వర్యంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు.

Sai Baba Temple Bhakti | అన్నదాతల వితరణ..
అన్నదానం అన్నిదానాల కన్నా మిన్న అని చాటుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాగిర్యాలకు చెందిన బొంగు వాణి-నవీన్ గౌడ్ కుటుంబ సభ్యులు, అమెరికా (America)లో ఉంటున్న మోతె గ్రామానికి చెందిన పోతుగంటి సౌమ్య-బాలరాజు దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్‌కు గాయాలు..

