Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు

తాజా వార్తలుసినిమా

Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. తాజాగా ఈ బ్యూటీ కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేదికగా హిస్టరీ క్రియేట్​ చేసింది.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 4:08 సా.
admin
1 నెల ago
Share
Sai Pallavi Awards

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Sai Pallavi Awards | భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. తాజాగా ఈ బ్యూటీ కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేదికగా హిస్టరీ క్రియేట్​ చేసింది. ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న యాక్టర్​గా రికార్డులకెక్కింది. ‘అమరన్’ మూవీకి గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. దీంతో ఆమె ఖాతాలో మొత్తం ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు చేరాయి.

Contents
  • Sai Pallavi Awards | 10 ఏళ్ల సినీ ప్రయాణంలో..
    • Sai Pallavi Awards | ఇతర చిత్రాల్లోనూ..
      • Sai Pallavi Awards | రామాయణ చిత్రంలో సీత పాత్ర..

Sai Pallavi Awards | 10 ఏళ్ల సినీ ప్రయాణంలో..

సాయిపల్లవి తన 10 ఏళ్ల సినీ ప్రయాణంలో.. అది కూడా 20 సినిమాలు మాత్రమే పూర్తి చేయకుండానే ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం. ప్రేమమ్ (మలయాళం): ‘మలర్’ టీచర్‌గా తన ఫస్ట్​ మూవీతోనే ‘బెస్ట్ ఫిమేల్ డెబ్యూ’ అవార్డు అందుకుంది. ఫిదా (తెలుగు): ‘భానుమతి’ పాత్రలో తెలంగాణ భాషతో ప్రేక్షకులను మెప్పించి ‘ఉత్తమ నటి’గా తొలి తెలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కించుకుంది. ఇక శ్యామ్ సింగ రాయ్ (తెలుగు): దేవదాసి పాత్రలో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సినిమాలో ఆమె భావోద్వేగాలకు ‘ఉత్తమ నటి’ అవార్డు లభించింది. అంతేకాకుండా నాగచైతన్యతో కలిసి నటించిన లవ్ స్టోరీ (తెలుగు): మూవీకి కూడా ‘ఉత్తమ నటి’ పురస్కారం లభించింది.

Sai Pallavi Awards | ఇతర చిత్రాల్లోనూ..

విరాటపర్వం (తెలుగు): వెన్నెల పాత్రలో ఆమె నటనకు ‘ఉత్తమ నటి (క్రిటిక్స్)’ అవార్డు దక్కింది. అలాగే గార్గి (తమిళం): కూతురిగా ఆమె నటనకు ‘ఉత్తమ నటి’ (తమిళం) అవార్డు లభ్యమైంది. అమరన్ (తమిళం): ఈ చిత్రంలో ‘ఇందు రెబెకా వర్గీస్’ పాత్రకు గాను తాజాగా 7వ ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకుంది. పదేళ్ల కెరీర్​లోనే ఏడు ‘బ్లాక్ లేడీ’ అవార్డులు అందుకోవడం సాయి పల్లవికే సాధ్యమైంది.

Sai Pallavi Awards | రామాయణ చిత్రంలో సీత పాత్ర..

సాయి పల్లవి ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రామాయణ’ చిత్రం చేస్తోంది. ఇందులో సీత పాత్రలో నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా మూవీతో ఆమె క్రేజ్ మరో రేంజ్​కు చేరనుంది. ఇదే జోరు కొనసాగితే, భవిష్యత్తులో ఆమె నేషనల్ అవార్డులతో పాటు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకోవచ్చని సినీ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : హరీశ్​రావు
Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
Daily Horoscope Today | అత్యంత గోప్యమైన​ సన్నివేశాలు.. గొప్ప అనుభూతులు.. ఈ రాశుల వారి వైవాహిక జీవితం ఎంతో రొమాంటిక్!
Stock Market Rally | తగ్గుతున్న యుద్ధ భయాలు.. పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు
TAGGED:Amaran Tamil MovieFidaaFilmfare Awards SouthGargi Tamil MovieLove Story Telugu MoviePremamRamayana MovieRanbir KapoorSai PallaviShyam Singha RoyVirata Parvam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Delhi Bomb Threat Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలవరం
Next Article Inter Exams 2026 Inter Exams 2026 | ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?