అక్షరటుడే, కామారెడ్డి: Sainyasena Organization | కన్నబిడ్డలు తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోకపోవడంపై ‘అక్షరటుడే’ (AksharaToday)లో సోమవారం ‘కన్నోళ్లకు కన్నీళ్లే..’ శీర్షికతో ప్రచురితమైన కథనం పలువురిని కలిచివేస్తోంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరం చేసే కొడుకులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Sainyasena Organization | స్పందించిన సైన్యసేన అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేష్..
కామారెడ్డి జిల్లా (Kamareddy)లో సైన్యసేన సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎర్రోళ్ల నరేష్ (Errolla Naresh) ‘అక్షరటుడే’ కథనంపై స్పందించారు. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులను పలువురు నిర్లక్ష్యం చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమను కన్నందుకు వారి రుణం తీర్చుకోవాల్సింది పోయి.. వారిని అనాథలుగా మార్చడం సరికాదని వ్యాఖ్యానించారు.
Sainyasena Organization| బాధపడకండి.. మీ వెంట నేనుంటా..
ఈ సందర్భంగా ఎర్రోళ్ల నరేష్ మాట్లాడుతూ.. వృద్ధులు బాధపడవద్దని.. తాను కన్నకొడుకులా చూసుకుంటానని భరోసా కల్పించారు. తనకు సమాచారమిస్తే వారిని అక్కున చేర్చుకుంటానని తెలిపారు. కొడుకును కాకపోయినా కన్న కొడుకులా చూసుకుంటానని హామీ ఇచ్చారు. నిత్యావసర వస్తువులు అందజేస్తానని.. వృద్ధ్యాప్యంలో ఉన్నవారి అవసరాలు సంస్థ ద్వారా తీరుస్తానని తెలిపారు. 9912890421కు ఫోన్చేస్తే క్షణాల్లో సాయం చేయడానికి మీ ముందుంటామని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Pochampad | పోచంపాడ్‌లో కత్తిపోట్ల కలకలం.. యువకుడి మృతి
