Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sajjanar Warning | బలవంతంగా రంగులు పూస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Sajjanar Warning | బలవంతంగా రంగులు పూస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్​

హైదరాబాద్

Sajjanar Warning | బలవంతంగా రంగులు పూస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్​

పోలీస్​ అధికారులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్​ సమీక్ష నిర్వహించారు. హోలీ పండుగ ప్రశాంతంగా జరుపుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 7:25 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Sajjanar Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sajjanar Warning | నగరంలో హోలీ పండుగ (Holi Festival)ను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar)​ పోలీసులకు సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Contents
  • Sajjanar Warning | షీ టీమ్స్​ నిఘా
    • Sajjanar Warning | మద్యం దుకాణాల బంద్​

బంజారాహిల్స్‌లోని కమాండ్​ కంట్రోల్​ సెంటర్ (TGICCC)​ నుంచి సోమవారం సీపీ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పండుగ పూట అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బ్లూ కోట్స్, పెట్రోలింగ్ సిబ్బంది గస్తీ కాయాలన్నారు. ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Sajjanar Warning | షీ టీమ్స్​ నిఘా

బహిరంగ ప్రదేశాల్లో, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించేందుకు నగరవ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు. ప్రజలు రసాయన రంగులకు బదులు సహజసిద్ధమైనవి వాడాలని సీపీ సూచించారు. హోలీ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదన్నారు. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్​ చేస్తే వాహనాలు సీజ్​ చేస్తామన్నారు.

Sajjanar Warning | మద్యం దుకాణాల బంద్​

హోలీ సందర్భంగా క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్ష‌లు విధించిన‌ట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ స‌మావేశంలో అద‌న‌పు సీపీ త‌ఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు శ్వేత‌, ఎస్ఎం విజ‌య్ కుమార్, డీసీపీలు ఖారే కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, రూపేశ్, వెంక‌ట ల‌క్ష్మి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి :  Hyderabad Traffic Relief | ట్రాఫిక్​ రద్దీ నివారణకు చర్యలు : సీపీ సజ్జనార్​

GHMC Property Tax Dues | జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు.. బకాయిలపై ఉక్కుపాదం.. పలువురి ఆస్తుల స్వాధీనం
RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Hyderabad Bomb Threat | హైదరాబాద్ ఐఎండీ కార్యాలయానికి బాంబు బెదిరింపులు
TAGGED:Banjara HillsCV Anand SajjanarDJ ban HoliHoli festival securityHyderabad PoliceLiquor shop closureShe Teams HyderabadTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gulf Iran Tensions Gulf Iran Tensions | గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చలు
Next Article SC Reservations SC Reservations | ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : కల్వకుంట్ల కవిత
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?