Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా

తెలంగాణక్రీడలు

Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా

అంతర్జాతీయ టెన్నిస్‌లో భారత్‌కు పలు విజయాలు అందించిన అర్జున అవార్డు గ్రహీత మైనేని సాకేత్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవప్రదమైన అవకాశం కల్పించింది. ఆయనను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఎన్టీఆర్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చింది.

Shashi kiran mottala
Last updated: మార్చి 6, 2026 11:37 ఉద.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Saketh Myneni Deputy Collector

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Saketh Myneni Deputy Collector | అంతర్జాతీయ టెన్నిస్‌లో భారత్‌కు పలు విజయాలు అందించిన అర్జున అవార్డు గ్రహీత మైనేని సాకేత్‌కు (Saketh Myneni) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవప్రదమైన అవకాశం కల్పించింది. ఆయనను డిప్యూటీ కలెక్టర్‌గా(Deputy Collector Appointment) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఎన్టీఆర్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చింది.

Contents
  • Saketh Myneni Deputy Collector |  అంతర్జాతీయ టెన్నిస్ రంగంలో..
    • Saketh Myneni Deputy Collector | యువ‌త‌కు ప్రేర‌ణ‌గా..
      • Saketh Myneni Deputy Collector | గౌరవప్రదమైన అవకాశం..
        • బాధిత కుటుంబాలకు అండగా..

Saketh Myneni Deputy Collector |  అంతర్జాతీయ టెన్నిస్ రంగంలో..

అంతర్జాతీయ టెన్నిస్ రంగంలో భారత్‌కు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) గర్వకారణంగా నిలిచిన అర్జున అవార్డు గ్రహీత మైనేని సాకేత్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) ఆయనను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంతో ఆయనకు ఎన్టీఆర్ జిల్లాలో(NTR District News) బాధ్యతలు అప్పగించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ మైనేని సాకేత్‌కు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సాకేత్‌ను అభినందిస్తూ ఆయన క్రీడా రంగంలో సాధించిన విజయాలను కొనియాడారు.

Saketh Myneni Deputy Collector | యువ‌త‌కు ప్రేర‌ణ‌గా..

కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, ఆసియన్ గేమ్స్‌తో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు సాధించి రాష్ట్ర ప్రతిష్టను (Saketh Myneni Deputy Collector) ప్రపంచవ్యాప్తంగా పెంచిన సాకేత్‌కు ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించిందన్నారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించడం ద్వారా యువతకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. అలాగే వచ్చే వారం జరిగే ఏటీపీ ఛాలెంజర్ టూర్‌లో పాల్గొనేందుకు సాకేత్ Saketh ఐరోపా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత కీర్తి తీసుకురావాలని కోరారు. జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Saketh Myneni Deputy Collector | గౌరవప్రదమైన అవకాశం..

ఈ సందర్భంగా మైనేని సాకేత్ మాట్లాడుతూ, తనకు ఈ గౌరవప్రదమైన అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ (Saketh Myneni Deputy Collector) ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడా రంగంలో తన ప్రయాణం కొనసాగుతూనే ప్రజాసేవలో కూడా బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన కడప జిల్లాకు చెందిన యువ క్రికెటర్ శ్రీచరణికి Sree Charani ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ఇవ్వడంతో పాటు 500 గజాల ఇంటి స్థలం కేటాయించింది. అంతేకాకుండా ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్–1 స్థాయి ఉద్యోగం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది.

tennis

బాధిత కుటుంబాలకు అండగా..

అదేవిధంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సర్వీసులో ఉండగా మరణించిన 1993 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి రమేశ్ కుమార్ సుమన్ కుమార్తె మిష్కా సుమన్‌కు కారుణ్య నియామకం కింద గ్రూప్–1 సర్వీసులో ఉద్యోగం కల్పించారు. ఆమెను సీడీఎంఏ కార్యాలయంలో గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వరుస నిర్ణయాలు ప్రతిభావంతులను గౌరవించడం, అలాగే బాధ్యతాయుత కుటుంబాలను ఆదుకోవడం విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం ద్వారా యువతలో youth క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో ఈ చర్యలు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: MARCH 06 Gold Silver Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి పరిస్థితి ఏమిటంటే..

 

Lok Sabha Seats Increase | కేంద్రం కీలక నిర్ణయం.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు
HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిన యువతి… హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన యువకుడు
Sanju Samson 97 | సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై థ్రిల్లింగ్ విజయం
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Karimnagar ACB Arrest | యూపీఐ ద్వారా లంచాలు.. ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్
TAGGED:Andhra Pradesh GovernmentAP Sports NewsArjuna Award WinnerDeputy Collector AppointmentNTR District NewsSaketh MyneniSports Quota Jobs India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Wanaparthy Road Accident Wanaparthy Road Accident | ట్రాక్టర్​ను ఢీకొన్న ఆటో.. ఇద్దరు మృతి
Next Article Stock Market Losses Stock Market Losses | తగ్గని ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?