Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Samsung Mobile Fraud | తక్కువ ధరకే శాంసంగ్ ఫోన్ అంటూ మోసం.. పార్శిల్ విప్పి చూశాక షాక్‌

తక్కువ ధరకే శాంసంగ్ మొబైల్ ఫోన్ ఇస్తామని నమ్మించి ఆన్‌లైన్‌లో వేల మందిని మోసం చేసిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ మోసంలో దాదాపు 3,880 మందిని లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 1:43 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Samsung Mobile Fraud

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samsung Mobile Fraud | ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే శాంసంగ్ మొబైల్ ఫోన్ ఇస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు.

Contents
  • Samsung Mobile Fraud | సుల‌భంగా డ‌బ్బులు సంపాదించాల‌ని..
    • Samsung Mobile Fraud | పెద్ద మొత్తంలో

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (Rajendranagar Police Station) పరిధిలోని హైదర్‌గూడలో ఉన్న ఒక కార్యాలయంపై పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసాలకు కర్ణాటకకు చెందిన ఎస్. విజయ్ కుమార్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. అతనితో పాటు శివకుమార్, ముద్దీన్, శశికాంత్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Samsung Mobile Fraud | సుల‌భంగా డ‌బ్బులు సంపాదించాల‌ని..

పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ గతంలో తానే ఒక ఆన్‌లైన్ మోసానికి గురై డబ్బులు కోల్పోయాడని తెలిసింది. ఆ తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇదే విధానాన్ని అనుసరిస్తూ మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ ముఠా గత ఐదేళ్లుగా ఈ మోసాలను కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2021 నుంచి ఇప్పటివరకు సుమారు 3,880 మందిని మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. తక్కువ ధరకే శాంసంగ్ మొబైల్ ఫోన్ (Samsung Mobile Phone)   ఇస్తామని చెప్పి టెలీకాలర్ల ద్వారా బాధితులకు ఫోన్లు చేసి ఆర్డర్లు తీసుకునేవారు. డబ్బులు చెల్లించిన తర్వాత మాత్రం అసలు మొబైల్ ఫోన్ పంపకుండా బ్లూటూత్ స్పీకర్లు లేదా తక్కువ విలువ కలిగిన హెర్బల్ ఉత్పత్తులను పోస్టు ద్వారా పంపించి మోసం చేసేవారు.

Samsung Mobile Fraud | పెద్ద మొత్తంలో

నిందితులు నిర్వహిస్తున్న కార్యాలయంలో నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.40 లక్షల నగదు, 50 సిమ్ కార్డులు, ల్యాండ్ ఫోన్లు మరియు ఇతర పరికరాలను పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం నిందితులను కోర్టులో హాజరుపరచగా, కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఆఫర్లకు మోసపోవద్దని ప్రజలకు పోలీసులు సూచించారు.

ఇది కూడా చదవండి..: VIVO T5x 5G | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో.. వీవో టీ5ఎక్స్ 5జీ విడుదల

Adulterated Ghee | డాల్డాతో నెయ్యి తయారీ.. తిన్నారంటే అంతే!
Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Ramakrishna Rao Extension | సీఎస్​ పదవీ కాలం మరో మూడు నెలల పొడిగింపు!
Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
TAGGED:Cyber Crime NewsHyderabad PoliceIndia crime newsMobile Scam CaseOnline Fraud IndiaOnline Shopping FraudSamsung Mobile ScamSamsung Phone Scam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Delhi Fire Accident Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
Next Article Indiramma Housing Scheme  Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?