అక్షరటుడే, మాక్లూర్ : Sanatana Dharma | భారతదేశ సంస్కృతి ప్రపంచానికి (Sanatana Dharma) ఆదర్శమని మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహరాజ్ (Pitla krishna Maharaj) అన్నారు. అలాంటి మన సంస్కృతి, (Hindu Unity) సనాతన ధర్మాన్ని రక్షించుకునేందుకు హిందువుగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Sanatana Dharma | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గొట్టుముక్కల (RSS Centenary) గ్రామంలో ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిట్ల కృష్ణ మహరాజ్ హిందూ ధర్మ పరిరక్షణపై మాట్లాడారు. మన ధర్మం కోసం అనేక పోరాటాలు, యుద్ధాలు జరిగాయని.. రామాయణ, మహాభారత కథలను కొన్ని వివరించారు. మంచితో పాటు చెడు కూడా సమాజంలో ఉంటుందని.. కానీ రాముడు మంచికి సూచిక అయితే రావణుడు చెడుకు సంకేతమని అభివర్ణించారు.
Sanatana Dharma | ఆలయాలను కాపాడుకుంటూ..
గ్రామాల్లో ఉన్న ఆలయాలను కాపాడుకుంటూ వాటి అభివృద్ధికి (Indian Heritage) సహకారం అందించాలని పిట్ల కృష్ణ మహరాజ్ సూచించారు. చిన్నతనం నుంచే పసిపిల్లలకు (Spiritual Event) ధర్మ సందేశాలు బోధించాలని సూచించారు. పిల్లలను ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం యువకులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ ధర్మ రక్షణలో పాల్గొనడం శుభసూచకమన్నారు. భావితరాలకు కూడా ఇదే స్ఫూర్తిని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భక్తి పాటలతో (Temple Preservation) కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం అన్నదానం నిర్వహించారు.
రాముని బాటలో నడవాలి
ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ మాట్లాడుతూ మన దేశం వసుదైవ కుటుంబమని, అంతా రాముని బాటలో నడవాలని సూచించారు. హిందుత్వం మన జీవన విధానమని పేర్కొన్నారు.పిల్లలకు నిస్వార్థం, దానగుణం, దయ నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలు దారి తప్పకుండా సరైన మార్గంలో నడిచేలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఛత్రపతి శివాజీ మహరాజ్ తదితరులు చూపిన మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ గ్రామ వికాస్ జిల్లా ప్రముఖ్ ధాత్రి పాండు రంగారావు, హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు బచ్చు రమేశ్, ప్రధాన కార్యదర్శి యాట గంగాధర్, సర్పంచ్ యాట సువర్ణ, ఉప సర్పంచ్ ఒడ్డెన్న, గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు, 18 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు
