అక్షరటుడే, బాన్సువాడ: Sand Booking App | యాప్ ద్వారానే ఇసుకను బుక్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సూచించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Sand Booking App | ‘మన ఇసుక వాహనం’ ద్వారా..
కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గృహ నిర్మాణదారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన (sand supply syste) ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ‘మన ఇసుక – వాహనం’ ఆన్లైన్ విధానాన్ని అమలుపరుస్తోంది. ఈ విధానంలో భాగంగా, ఇసుక అవసరమున్న వినియోగదారులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం (http://tgmiv.cgg.gov.in)లో లాగిన్ అవ్వాలి. అనంతరం సంబంధిత పంచాయతీ సెక్రెటరీ దరఖాస్తును పరిశీలించి తహశీల్దార్‌కు పంపుతాడు. తహశీల్దార్ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అనుమతి మంజూరు చేస్తారు.
Sand Booking App | ఆన్లైన్లో చెల్లింపులు..
అనుమతి వచ్చిన తరువాత దరఖాస్తుదారుడు (construction materials india) ఆన్లైన్లో చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అనంతరం, అనుమతి పొందిన (telangana news) ఇసుక అమ్మకం జరిగే ప్రాంతానికి ట్రాక్టర్‌తో (building materials booking) వెళ్లి, సంబంధిత అధికారికి తనకు వచ్చిన క్యూఆర్ కోడ్‌ను చూపించి ఇసుకను నింపుకొని వెళ్లవచ్చు. ప్రభుత్వ అవసరాల కోసం ఇసుకను సంబంధిత ప్రభుత్వ ఇంజినీరింగ్ అధికారి దరఖాస్తును ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Encroachment Drive | ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
