అక్షరటుడే, కామారెడ్డి: Sandeepani Inter Results | ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి (Kamareddy) సాందీపని జూనియర్ కళాశాల (sandeepani junior college) విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారు. కళాశాలకు చెందిన 9 మంది విద్యార్థులు ఏకంగా 995కు పైగా మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చారు.
Sandeepani Inter Results | ఎంపీసీ సెకండియర్లో..
ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక 995, దీర్ఘ 993, మాన్యశ్రీ 992 మార్కులు సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అస్మా జబీన్ 996, శారికా ముస్కాన్ 995, సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక 996, తిమోతి 995 మార్కులు పొందారు. అలాగే ఎంఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కీర్తి 978, పల్లవి 965 మార్కులు సాధించారు. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షర 468, హురియా దుల్సత్ 467, అద్వైత 467, బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అయేషా సిద్దిఖా 436, ఆఫీయా తబస్సుమ్ 435 మార్కులతో ప్రతిభ చూపారు. ఎంఈసీ ఫస్టియర్ చదువుతున్న ఈశ్వర వినూత 494, ప్రాచి 488, సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న త్రిష జైన్ 485, తేజార్జున్ రెడ్డి 485 మార్కులు సాధించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.
ఇది కూడా చదవండి: Hormuz Strait blockade | హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
