అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sangareddy Tragedy | సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తాను ఆత్మహత్య చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా కంది మండలం జులకల్ (Julakal)కు చెందిన మమత(28)కు ఇద్దరు పిల్లలు మణికంట, ప్రళయ ఉన్నారు. ఆమె భర్త పెంటయ్య జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె మనస్తాపానికి గురైంది. భర్త లేకుండా జీవించలేనని భావించింది. ఈ క్రమంలో శనివారం తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చింది. వారు మరణించాక.. ఆమె సైతం ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sangareddy Tragedy | విషాదఛాయలు
రెండు నెలల వ్యవధిలో ఒక కుటుంబం మొత్తం చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలను చూసి బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు.
దీనిని కూడా చదవండి : Hyderabad Drug Bust | నగరంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలు.. పలువురి అరెస్ట్

