అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sanju Samson 97 | కోల్‌కతా (Kolkata)లో ఆదివారం జరిగిన తమ చివరి సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా సమష్టిగా రాణించి వెస్టిండీస్‌కి 5 వికెట్ల తేడాతో ఓడించింది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ 40, రోవ్‌మన్ పోవెల్ 34 నాటౌట్, జాసన్ హోల్డర్ 37 నాటౌట్‌లతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ దక్కించుకున్నారు.
Sanju Samson 97 | నిరాశపరిచిన ఆరంభం
195 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు మరోసారి ఆశించిన స్టార్ట్ రాలేదు. అభిషేక్ శర్మ (Abisekh Sharma) త్వరగా ఔటవ్వగా, ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సంజూ శాంసన్ బాధ్యత తీసుకున్నాడు.కెప్టెన్ సూర్యకుమార్ (Captain Suryakumar) యాదవ్‌తో కలిసి సంజూ జట్టును నిలబెట్టాడు. వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సంజూ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. సూర్య (18) ఔటైన తర్వాత కూడా సంజూ తన దూకుడు కొనసాగించాడు. తిలక్ వర్మ 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినా, హోల్డర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 17 పరుగులు చేసి ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
Sanju Samson 97 | టీమిండియా సెమీఫైనల్
చివరి రెండు ఓవర్లలో భారత్‌కు 17 పరుగులు అవసరమయ్యాయి. శివమ్ దూబే రెండు కీలక బౌండరీలు బాది ఒత్తిడిని తగ్గించాడు. ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమైన వేళ సంజూ శాంసన్ సిక్సర్, ఫోర్ బాది భారత విజయాన్ని ఖాయం చేశాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో అజేయ 97 పరుగులు చేసిన సంజూ శాంసన్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఈ విజయం ద్వారా టీమిండియా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. అయితే కొన్నాళ్లుగా సంజూ సామన్స్‌కి అవకాశాలు అంతగా రావడం లేదు. మధ్యమధ్యలో అలా వచ్చి ఇలా వెళుతున్నాడు.ఈ మ్యాచ్ మాత్రం సంజూ కెరియర్‌లో ప్రత్యేకం కానుంది.
ఇది కూడా చదవండి..: India T20 Semifinal | కరేబియన్ జట్టుపై ఘన విజయం.. సెమీ ఫైనల్లోకి భారత్

