అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sarpanch Training Program | కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Kamarreddy district news) నాలుగో విడత సర్పంచుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన సర్పంచుల మొదటి రోజు శిక్షణలో పాల్గొన్నారు.
Sarpanch Training Program | గ్రామాల అభివృద్ధి.. చట్టాలు..
ఈ శిక్షణ కార్యక్రమం జిల్లా అధికారుల సమక్షంలో ప్రారంభమైంది. గ్రామాల అభివృద్ధి (Telangana village development), పంచాయతీరాజ్ చట్టాలు (Panchayati Raj training), నిధుల వినియోగం, గ్రామసభల నిర్వహణ (Gram Sabha management), పారదర్శక పాలన వంటి అంశాలపై నిపుణులు సర్పంచులకు సమగ్ర అవగాహన కల్పించారు. మొదటి రోజు శిక్షణలో ముఖ్యంగా గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించే విధానం, ప్రభుత్వ పథకాల అమలు, హరితహారం, మిషన్ భగీరథ వంటి అంశాలపై వివరణాత్మకంగా చర్చించారు. అదేవిధంగా గ్రామస్థులతో సమన్వయం, సమస్యల పరిష్కారంలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి అనే అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
Sarpanch Training Program | బాధ్యతతో ముందుకు వెళ్లేందుకు ఉపయోగం..
శిక్షణలో పాల్గొన్న ఎల్లారెడ్డి సర్పంచులు మాట్లాడుతూ.. ఈ తరహా శిక్షణలు తమకు గ్రామాభివృద్ధిలో మరింత బాధ్యతతో ముందుకు సాగేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ విధానాలను గ్రామ స్థాయిలో సమర్థంగా అమలు చేయడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగనుండగా, తదుపరి రోజుల్లో డిజిటల్ రికార్డుల నిర్వహణ, ఆడిట్ విధానాలు, గ్రామ నిధుల పారదర్శక వినియోగం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు సమగ్ర అవగాహనతో పనిచేస్తే గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారతాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర

