అక్షరటుడే, కామారెడ్డి: Sarpanch Upasarpanch Dispute | గ్రామంలో పనులు చేయకపోతే సర్పంచ్‌లను గ్రామస్థులు నిలదీయడమో, విధులకు ఆటంకం కలిగించడమో (Local Governance Issue) చూస్తుంటాం.. అయితే ఇక్కడ ఆ సర్పంచ్‌కు ఉప సర్పంత్తోనే పేచీ వచ్చిపడింది.
Sarpanch Upasarpanch Dispute |తరచుగా విధులకు ఆటంకం కలిగిస్తూ..
తరచుగా తన విధులకు ఉప సర్పంచ్ ఆటంకం కలిగిస్తుండటం, అది కూడా కుర్చీ విషయంలో పేచీ(Village Chair Controversy) రావడంతో ఆ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కలెక్టర్‌తో (Kamareddy News) పాటు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గాంధారి మండలం (Gandhari Mandal News) గండివేట్ గ్రామంలో చోటుచేసుకుంది. సర్పంచ్ అనూష తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా అనూష గెలుపొందగా ఉప సర్పంచ్‌గా కాశీరాం ఎన్నికయ్యారు. గత కొన్ని రోజులుగా సర్పంచ్ అనూష ఉప సర్పంచ్ కాశీరాం మధ్య కుర్చీ విషయంలో గొడవ జరుగుతోంది. గ్రామపంచాయతీ భవనం చిన్నగా ఉండడంతో సర్పంచ్ కుర్చీతో పాటు వార్డు సభ్యులకు, ఉపసర్పంచ్‌లకు కుర్చీలు వేశారు.
Sarpanch Upasarpanch Dispute |ప్రత్యేకంగా కుర్చీ తెచ్చుకుని..
ఉపసర్పంచ్‌కు ప్రత్యేక కుర్చీ లేకపోవడంతో కాశీరాం స్వయంగా ఓ కుర్చీ తెచ్చుకొని గ్రామపంచాయతీ భవనంలో వేసుకున్నాడు. అయితే ఉపసర్పంచ్ కుర్చీ వేసుకోవడంతో సర్పంచ్ అనూషకు లోపలకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దాంతో ప్రతిరోజు ఉపసర్పంచ్ కాశీరాం తెచ్చుకున్న కుర్చీలో కూర్చోవడంతో సర్పంచ్ అనూష గ్రామపంచాయతీ భవనం లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
Sarpanch Upasarpanch Dispute | విధులకు ఆటంకం..
అంతేకాకుండా ఉపసర్పంచ్ కుర్చీలో కూర్చుంటూ సర్పంచ్ అనూష విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. అలాగే ఫోన్లో ఇతరులను దుర్భాషలాడుతూ.. సర్పంచ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పారు. దీంతో విసిగిపోయిన సర్పంచ్ అనూష సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు వినతిపత్రం అందజేశారు. అలాగే వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉపసర్పంచ్ కాశీరాంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో పీఆర్టీయూ నేత మృతి

