Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Sathankulam Custodial Death Case | లాకప్​డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Sathankulam Custodial Death Case | లాకప్​డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

జాతీయంక్రైం

Sathankulam Custodial Death Case | లాకప్​డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లాకప్​ డెత్ కేసులో నిందితులైన 9 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 7:27 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Sathankulam Custodial Death Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sathankulam Custodial Death Case | తమిళనాడు (Tamil Nadu)లోని మదురై మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు (Madurai Court) సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. లాకప్​ డెత్ కేసులో నిందితులైన 9 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించింది.

తూత్తుకుడి జిల్లాలోని సాత్తంకుళంలో పి. జయరాజ్, అతని కుమారుడు జె. బెనిక్స్​ హత్య కేసులో దోషులుగా తేలిన తొమ్మిది మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించింది. కోవిడ్-19 లాక్‌డౌన్ (Covid Lockdown) సమయంలో నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా తమ దుకాణాన్ని తెరిచి ఉంచారన్న ఆరోపణలపై 2020 జూన్ 19 సాయంత్రం జయరాజ్, బెనిక్స్‌లను సాత్తంకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రాత్రి పోలీసులు వారిని దారుణంగా హింసించారు. మరుసటి రోజు కోవిల్‌పట్టి సబ్​ జైలుకు తరలించారు. అయితే 2020 జూన్ 22న కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బెనిక్స్ మరణించగా, అతని తండ్రి జయరాజ్ జూన్ 23న చనిపోయాడు.

Sathankulam Custodial Death Case | సీఐ, ఎస్సైలు..

లాకప్​డెత్​ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మద్రాస్​ హైకోర్టు (Madras High Court) ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. అప్పటి ఇన్‌స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్-ఇన్‌స్పెక్టర్లు కె. బాలకృష్ణన్, పి. రఘు గణేష్, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్. మురుగన్, ఎ. సమదురై, కానిస్టేబుళ్లు ఎం. ముత్తురాజా, ఎస్. చెల్లదురై, ఎక్స్. థామస్ ఫ్రాన్సిస్, ఎస్. వైల్ముత్తు అనే తొమ్మిది మందికి న్యాయమూర్తి జి. ముత్తుకుమారన్ మరణశిక్ష విధించారు. ఈ కేసులో 10వ నిందితుడు, అప్పటి స్పెషల్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాల్దురై అరెస్టు అయిన తర్వాత ఆగస్టు 2020లో కోవిడ్-19 కారణంగా మరణించారు. ఈ తీర్పుతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీ హింస కేసులలో జవాబుదారీతనానికి ఇది ఒక అరుదైన, బలమైన ఉదాహరణగా చాలామంది భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి : PNG Connections India | పెరిగిన పీఎన్‌జీ కనెక్షన్లు..

Judiciary Corruption Chapter | 8వ తరగతిలో “న్యాయవ్యవస్థలో అవినీతి” పాఠ్యాంశం.. ఎన్​సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మండిపాటు
Global Crisis Warning | ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది : రక్షణ మంత్రి రాజ్​నాథ్​
Gandhari Police Case | గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హతమార్చిన కోడలు
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
TAGGED:Court Verdictcustodial deathhuman rightsindia judiciarypolice brutalitysathankulam caseTamil Nadu news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Temple Development Funds | Temple Development Funds | మాటిచ్చి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. ఆలయానికి భారీగా నిధులు విడుదల
Next Article Wrestling Competitions | Wrestling Competitions | కుస్తీకి సై అన్న మల్లయోధులు.. ఆకట్టుకున్న పోటీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?