అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Saudi Exit Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. రోజు రోజుకు దాడులు పెరుగుతుండటంతో యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ (Iran) గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. దీంతో రియాద్ (Riyadh)లోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికా పౌరులు వెంటనే సౌదీ అరేబియాను విడిచి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
ఇరాన్ బుధవారం రాత్రి ఖతార్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇతర దేశాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో అమెరికా అప్రమత్తం అయింది. ఇప్పటికే ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి దాడులు చేస్తే భారీ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో అమెరికా రాయబార కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా పౌరులు సురక్షితంగా వెళ్లగలిగితే సౌదీ అరేబియాను విడిచి వెళ్లడాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరింది.
Saudi Exit Warning | విమానాల ద్వారా..
వాణిజ్య విమానాల ద్వారా సౌదీ అరేబియాను విడిచి వెళ్లాలని అమెరికా పౌరులకు ఎంబసీ తెలిపింది. క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో తరచుగా విమాన రాకపోకలపై ఆంక్షలు ఉంటున్నాయని తెలిపింది. అయితే ప్రస్తుతం సౌదీ గగనతలం తెరిచే ఉందని పేర్కొంది. రియాద్, జెడ్డా, దమ్మామ్ విమానాశ్రయాలు తెరిచే ఉన్నాయని తెలిపింది.
Saudi Exit Warning | సూచనలు పాటించాలి
సౌదీ అరేబియాలోనే ఉండాలని నిర్ణయించుకున్న అమెరికా పౌరులు ఆ దేశం మార్గదర్శకాలను పాటించాలని రాయబార కార్యాలయం కోరింది. అయితే అది సకాలంలో హెచ్చరికలను అందించడంలో నిలకడగా విశ్వసనీయంగా లేదని హెచ్చరించింది. ఇరాన్ ప్రతీకార దాడులకు పదేపదే గురవుతున్న గల్ఫ్ దేశాలలో నెలకొన్న తీవ్రమైన ప్రమాదకర వాతావరణాన్ని ఈ హెచ్చరిక ప్రతిబింబిస్తోంది.
దీనిని కూడా చదవండి : Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!

