అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SC Reservations | రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntal Kavitha) అన్నారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో ఈ విషయం స్పష్టమైందన్నారు.
బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయం (Jagruthi Office)లో ఎస్సీ ఉప కులాల నాయకులతో సోమవారం కవిత సమావేశం నిర్వహించారు. పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే (Budget Sessions) తీర్మానం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఉప కులాలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
SC Reservations | జాగృతి ఉద్యమిస్తుంది
ఎస్సీ ఉప కులాలతో కలిసి రిజర్వేషన్ల పెంపు సహా వారి సమస్యల పరిష్కారం కోసం జాగృతి ఉద్యమిస్తుందని కవిత తెలిపారు. ఎస్సీ ఉప కులాల్లో కొన్నింటికి క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో 20 ఎస్సీ ఉప కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.
SC Reservations | జాగృతిలో చేరిక
తెలంగాణ జాగృతి మేడ్చల్ (Medchal) జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జాగృతిలో చేరారు. కవిత వారికీ కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. సంస్థ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి : Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత

