అక్షరటుడే, మెండోరా: SC ST Funds Cut | ఎస్సీ ఎస్టీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని వేల్పూర్ ఎస్సీ, ఎస్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం (BRS Office)లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
SC ST Funds Cut | మాయమాటలు చెప్పి అధికారంలోకి..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని.. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు తీవ్రమైన ద్రోహం చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హయాంలో ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో ఎస్సీ,ఎస్టీలకు స్వల్పంగా నిధులు మంజూరు చేస్తూ అన్యాయం చేసిందన్నారు.
SC ST Funds Cut | 70శాతం నిధులకు కోత..
ఈ ఏడాది బడ్జెట్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ నిధులను 70శాతం కోత విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని వారన్నారు. ప్రతిఏటా ప్రతివర్గానికి నిధులను పెంచుతూ వెళ్లాల్సిన ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో కోత విధించడం చూస్తుంటే ఎస్సీ, ఎస్టీలను దగా చేస్తున్నట్లేనని అర్థమవుతుందని వారు తెలిపారు. గత ఏడాది బడ్జెట్లో రూ.57వేల కోట్లు కేటాయించామని చెప్పుకున్న ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే కేటాయించి భారీ కోత పెట్టిందని వారు ఆరోపించారు.
SC ST Funds Cut | చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా..
ఇది సామాజిక న్యాయం ఏమాత్రం కాదని ఎస్సీ ఎస్టీల అభివృద్ధిని అణగదొక్కాలని ప్రయత్నించడమేనని వారు ఆరోపించారు. మల్లికార్జున కర్గే స్వయంగా చేవెళ్లకు వచ్చి చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేస్తామని పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగకపోవడం కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. అంబేడ్కర్ అభయ హస్తం కింద కేసీఆర్ (KCR) ఇస్తున్న రూ.10 లక్షల కాదు.. రూ.12 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క వ్యక్తి కూడా ఈ పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు.
ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విద్యాజ్యోతి పథకం (Vidya Jyothi Scheme) కింద నిధులు ఇస్తామన్న ప్రభుత్వం ఒక్క విద్యార్థికి కూడా నయాపైసా ఇప్పటివరకు చెల్లించలేదని విమర్శించారు. బడ్జెట్లో ఏ ప్రభుత్వం చేయనివిధంగా ఈ ఏడాది ఏకంగా 70శాతం నిధులను కోత విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తాళ్ల రాజన్న, జిన్నా శోభన్, సౌడ రమేష్, మోహన్ దాస్, లక్కం నర్సయ్య, కళ్యాణ్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Student Death Investigation | విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల న్యాయపోరాటం.. పోస్టుమార్టంకు పోలీసుల ఆదేశం

