అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : School Early Admissions | జిల్లాలో ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈవో అశోక్ (DEO Ashok)కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
School Early Admissions | విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే..
ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ జిల్లాలో విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా, అదేవిధంగా డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అదేవిధంగా 2026–27కు గాను.. విద్యాశాఖ (Education Department) నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే.. హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టి సీబీఎస్సీ సిలబస్ పేరుతో అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.
School Early Admissions | విద్యార్థుల తల్లిదండ్రలను తప్పుదోవ పట్టిస్తూ..
విద్యార్థుల తల్లిదండ్రులను తప్పు దోవ పట్టిస్తున్న ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుభోద్, జిల్లా ఉపాధ్యక్షుడు కుశాల్, జిల్లా నాయకులు కిషోర్, నిఖిల్, గణేష్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Eye Care Awareness | కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

