అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Seed Farmers Justice | రాష్ట్రంలో విత్తన పంటలు సాగు చేస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కోరారు. ఈ మేరకు శుక్రవారం రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులను కలిసి వినతి పత్రం అందింఆరు.
రాష్ట్రంలో రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తూ ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్నారని కవిత అన్నారు. కానీ వారికి 2007లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం (Contract Farming Act) ప్రకారం హక్కులు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేసే విధంగా ఆ చట్టాన్ని వాడకోవటం లేదన్నారు.
Seed Farmers Justice | విత్తన పత్తి రైతులకు మోసం
సీడ్ పత్తి (Cotton Seed) రైతులకు ఇచ్చే అడ్వాన్స్‌కు కూడా ఇంటరెస్ట్ తీసుకుంటూ భూములు రాయించుకుంటున్నారని కవిత ఆరోపించారు. కలెక్టర్లు, వ్యవసాయాధికారులు రైతుల పక్షాన నిలవటం లేదన్నారు. సీడ్ రైతులకు రైతు కమిషన్ (Farmers’ Commission) న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో వరి సీడ్ పండిస్తున్న రైతులకు ఎకరానికి రూ.75 వేలు ఇస్తున్నారని ఆమె చెప్పారు. కానీ గద్వాల్లో సీడ్ పత్తి పండించే రైతులకు అడ్వాన్స్, ఫెస్టిసైడ్స్‌కు ఇచ్చే డబ్బులకు కూడా భూమి తనఖా పెట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ పత్తి రైతులను మల్టీ లెవల్లో మోసం చేస్తున్నారని చెప్పారు.
Seed Farmers Justice | బకాయిలు చెల్లించాలి
సీడ్ పత్తి ఆర్గనైజర్స్, మీడియేటర్లు రైతులను పట్టి పీడిస్తున్నారని కవిత విమర్శించారు. ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పిన తర్వాత పంట వచ్చినా రాకపోయిన రైతులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీ వాళ్లు ఇచ్చే సీడ్ ఫెయిల్ అయితే దానికి కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. కానీ సరిగా నాటలేదంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆమె రైతు కమిషన్ దృష్టికి తెచ్చారు. గద్వాల్ జిల్లాలో 10 వేల మంది సీడ్ పత్తి రైతులకు రూ. 2 వందల కోట్లు రావాల్సి ఉందన్నారు.
ఇది కూడా చదవండి..: Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత

