అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali Comments | కేసీఆర్ (KCR) ఖజానా ఖాళీ చేసి వెళ్లిండు.. అయినా పథకాలు అమలు చేస్తున్నామని షబ్బీర్ అలీ అన్నారు. ప్రజాప్రతినిధులకు ఆయా శాఖల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
Shabbir Ali Comments | అనేక సమస్యలను పరిష్కరించాం..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ (Shabbir Ali) మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనలో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని, సర్పంచులు వచ్చేలోపు సగం సమస్యలు దూరమయ్యాయన్నారు. గ్రామాల్లో రేషన్ కార్డుల సమస్య ప్రధానంగా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్డులు ఇచ్చి సన్నబియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. గతంలో అధిక కరెంటు బిల్లులతో ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం సబ్సిడీ ద్వారా 90 శాతం మందికి ఉచిత కరెంట్ వస్తుందన్నారు.
Shabbir Ali Comments | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో..
ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) నిర్మాణంలో రాష్ట్రంలో నంబర్–1 స్థానంలో ఉన్నామని, పనులు మరింత వేగం పెంచి త్వరగా లక్ష్యాన్ని చేరాలని అధికారులకు సూచించారు. గతంలో బేస్మిట్ ఉన్నవాళ్లకు కూడా కొత్త ఇల్లు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం వేసవికాలం నేపథ్యంలో తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని, ఆ సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Shabbir Ali Comments | మిషన్ భగీరథ అధికారిపై షబ్బీర్ సీరియస్..
గ్రామాలు, పట్టణాల్లో ఎన్ని ఎంఎల్డీ వాటర్ ఇస్తున్నారని మిషన్ భగీరథ ఈఈని అడగగా తన దగ్గర వివరాలు లేవని అధికారి చెప్పడంతో షబ్బీర్ అలీ సీరియస్ అయ్యారు. జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం పెడితే అధికారి రావాలి కదా.. వచ్చిన వాళ్లయినా మొత్తం వివరాలను తీసుకుని రావాలి కదా అని అసహనం వ్యక్తం చేశారు. పైప్‌లైన్ పూర్తి చేస్తామని చెప్పిన గడువు లోపు చేయడం లేదని, ఎప్పటివరకు చేస్తారో కరెక్టుగా చెప్పాలని ప్రశ్నించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే బోర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
Shabbir Ali Comments | అర్హులకు పింఛన్లు ఇస్తాం..

కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్లాడు, ఎన్ని ఇబ్బందులైనా అర్హులైన వారికి పింఛన్లు ఇస్తామన్నారు. గ్రామాలకు 15 ఫైనాన్స్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇవ్వబోతోందని పేర్కొన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులకు ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి శిక్షణ ఇవ్వాలని, తద్వారా పాలనపై పట్టు పెరుగుతుందని కలెక్టర్‌ను కోరారు. సర్పంచులను పోలీసులు గుర్తు పట్టడం లేదని, పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఐడీ కార్డు చూపగానే గౌరవం ఇవ్వాలని ఎస్పీని కోరారు. అటవీ ఏరియాలో ఎప్పటినుంచో కబ్జాలో ఉన్న వారిని పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారని, ఫలితంగా పలువురు ఇబ్బంది పడుతున్నారన్నారు.
Shabbir Ali Comments | అటవీశాఖాధికారికి ఆదేశాలు..
గ్రామాల్లో సభలు నిర్వహించినప్పుడు అటవీశాఖ నిబంధనలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అటవీశాఖ అధికారి నిఖితకు షబ్బీర్‌అలీ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మధు మోహన్, ఏఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపల్ ఛైర్మన్లు ఇప్ప ఉమారాణి, పద్మ శ్రీకాంత్, కాసుల విజయ, సీమ, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Gas Cylinder Queues | సిలిండర్ల కోసం బారులు.. ఏజెన్సీల వద్ద పోలీసు భద్రత

