అక్షరటుడే, ఇందూరు: Shabbir Ali TNGOs Meeting | ప్రభుత్వ సలహాదారు (Government Advisor) షబ్బీర్‌అలీని (Shabbir Ali) టీఎన్జీవోస్ నేతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో (Hyderabad Secretariat) వారు ఆయనను కలిసి సన్మానించారు.
Shabbir Ali TNGOs Meeting | ఎంప్లాయీస్ హెల్త్ స్కీం ప్రకటనపై..
రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్‌స్కీంలో (Employee Health Scheme) సానుకూలంగా వ్యవహరించడంలో కృషి చేసినందుకు షబ్బీర్అలీకి (Shabbir Ali TNGOs Meeting) టీఎన్జీవోస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎంప్లాయీస్ జేఏసీ(Employees JAC) రాష్ట్ర ఛైర్మన్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. హుస్సేనీ ఆదేశానుసారం జిల్లా నేతలు షబ్బీర్‌ను కలిశారు.
Shabbir Ali TNGOs Meeting | ఉద్యోగుల సమస్యలపై చర్చ..
అనంతరం ఉమ్మడి జిల్లాల ఉద్యోగుల (Telangana Employees) సమస్యలపై ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు షబ్బీర్‌తో చర్చించారు. ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన నిలుస్తున్న ప్రభుత్వం మిగతా సమస్యలపై కూడా స్పందించాలని వారు కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, భీమ్‌గల్ యూనిట్ అధ్యక్షుడు సృజన్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Iran US Conflict | ఇరాన్‌పై యూఎస్ దాడులు.. ఆందోళనలో భారత్.. ఎందుకంటే?

