అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shamshabad Airport Flight Issue | సాంకేతిక సమస్యతో ఓ విమానం రన్‌వే పై ఆగిపోయింది. దీంతో మిగతా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాయపూర్ వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా రన్‌వేపై ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఫ్లైట్ నిలిచిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సిన విమానాలు కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. అలాగే టేకాఫ్ కావాల్సిన మరో మూడు విమానాలు సైతం ఆలస్యం అయ్యాయి. దీంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Shamshabad Airport Flight Issue | అధికారుల చర్యలు
విమానం రన్‌వేపై నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే దానిని పక్కకు తొలగించారు. అనంతరం సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించే పనిలో పడ్డారు. విమానాన్ని పక్కకు జరపడంతో గాలిలో ఉన్న విమానాలు ల్యాండ్ అయ్యాయి. అయితే విమానం ఎందుకు ఆగిపోయిందనే కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Heatwave Telangana | నేటి నుంచి పెరగనున్న ఎండలు
