అక్షరటుడే, వెబ్డెస్క్ : Shanti Suspension Case | అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (Assistant Commissioner, Endowments Department) శాంతిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారం మేరకు శాంతిపై ఏప్రిల్ 6న ఏసీబీ కేసు (ACB Case) నమోదు అయింది. అనంతరం ఏప్రిల్ 7న ఆమెను అరెస్ట్ చేశారు. రూ.1.37 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Shanti Suspension Case | ఈ నెల 7 నుంచే..
శాంతిని ఏసీబీ అధికారులు ఏప్రిల్ 7న అరెస్ట్ చేశారు. అదేరోజు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం ఆమె విజయవాడ జైలు (Vijayawada Jail)లో ఉన్నారు. ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి కస్టడీలో ఉంటే సస్పెండ్ చేయాలి. ఈ క్రమంలో సహాయ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 7 నుంచే అమలులోకి వచ్చాయని తెలిపారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని ఆదేశించారు.
కాగా శాంతి వివిధ ఆరోపణలతో 2024 జులై నుంచి శాంతి సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో శాంతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ ఏడాది మార్చి 24న సస్పెన్షన్ ఎత్తివేశారు. తిరిగి విధుల్లో చేరిన కొన్ని రోజులకే ఆమెపై ఏసీబీ కేసు కావడం, మరోసారి సస్పెండ్ కావడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : Toll Plaza Accident | బీఎండబ్ల్యూ కారుపై ట్యాంకర్ లారీ బోల్తా.. పలువురికి గాయాలు
