అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sharada Peeth Demolition Row | శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (MLA Harish Rao) ఆరోపించారు. కోకాపేట్ నియోపోలిస్‌లోని శారద పీఠానికి శనివారం ఉదయం చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విశాఖతో పాటు హైదరాబాద్ (Hyderabad)లో కూడా శారద పీఠం నిర్మించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. దేవాలయం నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. స్వామిజీ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారని చెప్పారు. నిత్య అన్నదానం, వేద పాఠశాల, గోశాల, అమ్మవారి ఆలయం నిర్మిస్తున్నారని చెప్పారు.
Sharada Peeth Demolition Row | వేదం ఎక్కడ ఉంటే అక్కడి సుభిక్షం
వేదం ఎక్కడ ఉంటే ఆ రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని హరీశ్ రావు అన్నారు. గోశాల, వేద పాఠశాల, అమ్మవారి ఆలయం ఇక్కడ ఉండడం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఈ దేవాలయం, మఠాన్ని ఎందుకు కూల్చాలని అనుకుంటున్నారని నిలదీశారు. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sharada Peeth Demolition Row | కూల్చడమే నీ పాలననా..!
కేసీఆర్ (KCR) ఆనవాళ్లు మారుస్తాను అంటే చివరకు కేసీఆర్ నిర్మించిన గుడులు కూడా కూలుస్తావా అని హరీశ్ రావు మండిపడ్డారు. అసలు ఏం చేయాలని అనుకుంటున్నావని ప్రశ్నించారు. కూల్చడమేనా నీ పాలననా అని నిలదీశారు. నిన్న ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చేశావని.. హైడ్రా పేరిట హైదరాబాద్ ప్రజల బతుకులు కూల్చావని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చేయడం తప్పా.. నీ పాలనలో నిర్మాణాలు లేవా అంటూ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి..: Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర
ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలి అనుకుంటున్నావు.. నిత్య అన్నదానం, వేద పాఠశాల, గోశాల, అమ్మవారి ఆలయం, ఇవన్నీ ఉండటం నీకు ఇష్టం లేదా
కేసీఆర్ అనవాళ్ళు మారుస్తాను అంటే ఆఖరికి కేసీఆర్ గారు కట్టిన గుడులు కూడా కూలుస్తావా
కూల్చడమేనా నీ… https://t.co/7DyKaRKqjL pic.twitter.com/APTYJEhKlU
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2026

