అక్షర టుడే, ఎల్లారెడ్డి: Shivaji Maharaj | హిందూ ధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్ అని బజరంగ్దళ్, వీహెచ్పీ ప్రతినిధులు అన్నారు. శివాజీ వర్ధంతి సందర్భంగా మండలంలో (Yellareddy Mandal) ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
Shivaji Maharaj | హైందవ సామ్రాజ్యం కోసం..
శివాజీ మహరాజ్ హైందవ సామ్రాజ్యం అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడని ప్రతినిధులు అన్నారు. ఆయన ఎన్నో దానధర్మాలు చేశారన్నారు. ఎందరో వీరులను తయారు చేసి హైందవ స్థాపన కోసం కృషి చేసిన యోధుడని పేర్కొన్నారు. హైందవ యువతీయువకులు శివాజీ మహరాజ్ ఆశయ సాధన కోసం కృషిచేయాలని వారు సూచించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదలాలన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఎల్లారెడ్డి (Vishwa Hindu Parishad Yellareddy)అధ్యక్షుడు నవీన్, ప్రఖండ సంఘటన మంత్రి వినోద్, జిల్లా గోరక్ష ప్రముఖ్, తులసీదాస్, రాహుల్, యాదగిరి, యాదగిరి, ప్రకాష్, చక్రి వెంకట్, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Doddi Komarayya Jayanthi | దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి: అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
