Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు

సినిమా

Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు

సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం మధురానగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 11:56 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Shivaji Raja Father Death
Shivaji Raja Father Death

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shivaji Raja Father Death | తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry)లో సుదీర్ఘకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Contents
  • Shivaji Raja Father Death | జూబ్లీహిల్స్‌లో అంత్యక్రియలు
    • Shivaji Raja Father Death | దాదాపు మూడు దశాబ్దాలకు పైగా

ఆయన తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మధురానగర్‌ (Mathuranagar)లోని స్వగృహంలో ఉదయం సుమారు 8 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Shivaji Raja Father Death | జూబ్లీహిల్స్‌లో అంత్యక్రియలు

రామరాజు మృతదేహాన్ని చివరి దర్శనార్థం ఇంటి వద్ద ఉంచి, మధ్యాహ్నం 3 గంటలలోపు మ‌హా ప్ర‌స్థానంలో  అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు శివాజీ రాజా కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. 1962 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని భీమవరంలో జన్మించిన శివాజీ రాజా తండ్రి రామరాజు అక్కడి డి.ఎన్.ఆర్ కాలేజీలో అటెండర్‌గా పనిచేశారు. నటనపై ఆసక్తితో శిక్షణ పొందిన శివాజీ రాజా తరువాత కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లి సినీ రంగ ప్రవేశం చేశారు. 1985లో విడుదలైన క‌ళ్లు చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆయనకు తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అనంతరం హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయక పాత్రల్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

Shivaji Raja Father Death | దాదాపు మూడు దశాబ్దాలకు పైగా

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో శివాజీ రాజా 400కు పైగా సినిమాలు, అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు. పెళ్లి సంద‌డి, సిసింద్రి, ఘ‌టోత్క‌చుడు, మురారి వంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. టెలివిజన్ రంగంలో అమృతం సీరియల్‌ (Amrutham Serial)లో ఆయన పోషించిన పాత్ర విశేష ప్రజాదరణ పొందింది. అలాగే వివిధ వినోద కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘మెగుడ్స్ పెళ్లామ్స్’ సినిమాతో హీరోగానూ నటించి తన వైవిధ్యాన్ని చాటుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా పరిశ్రమకు సేవలందిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (Movie Artists Association) (మా) అధ్యక్షుడిగానూ శివాజీ రాజా బాధ్యతలు నిర్వహించారు. తన ప్రత్యేక హాస్యశైలి, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.

ఇది కూడా చదవండి..: Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక

AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య
Vijay Rashmika Wedding | పెళ్లి ఫొటోలు పంచుకున్న రష్మిక
Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!
Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
TAGGED:Amrutham SerialAndhra PradeshMathuranagarMovie Artists AssociationTelugu Film Industry
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Chandra Grahan Temple Closure  Chandra Grahan Temple Closure | చంద్రగ్రహణం.. పలు ఆలయాల మూసివేత
Next Article Illegal Quarry Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?