అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shivalik Gas Tanker | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ (India)కు గ్యాస్ సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బందుల పడుతున్నారు. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసి వేయడంతో అనేక నౌకలు అక్కడ నిలిచిపోయాయి.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం (Central Government)తో ఇరాన్‌తో చర్చలు జరిపింది. దీంతో భారత నౌకలకు ఇరాన్ అనుమతిస్తోంది. దీంతో ఇప్పటికే పలు చమురు, గ్యాస్ నౌకలు భారత్‌కు చేరుకోగా.. నేడు శివాలిక్ ట్యాంకర్ షిప్ గుజరాత్ (Gujarat) తీరానికి రానుంది. దీంతో దేశంలో గ్యాస్ కష్టాలు కొంత మేర తీరనున్నాయి.
Shivalik Gas Tanker | గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని దాటిన ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ సోమవారం గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు చేరుకోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. LPGని తీసుకెళ్తున్న రెండు భారతీయ జెండాతో కూడిన నౌకలకు ఇరాన్ అధికారులు హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా అనుమతి ఇచ్చారు. వాటిలో ఒకటి శివాలిక్, మరొకటి నందా దేవి. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా (Rajesh Kumar Sinha) మాట్లాడుతూ.. శివాలిక్, నందా దేవి నౌకలు మార్చి 16, 17 తేదీల్లో వస్తాయని తెలిపారు.
Shivalik Gas Tanker | 24 భారత నౌకలు
హార్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న పర్షియన్ గల్ఫ్‌లో 24 భారతీయ జెండాతో కూడిన నౌకలు ఉండగా.. అందులో శివాలిక్, నందా దేవి నౌకలు జలసంధిని దాటాయి. శివాలిక్ ట్యాంకర్ నేడు గుజరాత్ తీరానికి రానుండగా నందాదేవి నౌక రేపు చేరుకోనుంది. ఈ నౌకల్లో సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. నందాదేవి నౌక కాండ్లా ఓడరేవులుకు రానుంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో 22 భారతీయ జెండాతో కూడిన నౌకలు ఉన్నాయని, వాటిలో మొత్తం 611 మంది నావికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్ తర్వాత ఏమి జరగబోతోంది!

