అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SI Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఎస్సైని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
సిద్దిపేట త్రీ టౌన్ ఎస్సై (Siddipet SII) వూర్లుగొండ వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. వెంకటేశ్వర్లు గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఎస్సైగా పని చేశాడు. ఆ సమయంలో ఓ ఇసుక లారీని ఆయన పట్టుకున్నాడు. దానిని వదిలేయడానికి రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం దానిని రూ.15 వేలకు తగ్గించాడు.
SI Caught by ACB | కానిస్టేబుల్ ద్వారా..
ఎస్సై లంచాన్ని నేరుగా తీసుకోలేదు. ఠాణాలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ ద్వారా దానిని తీసుకున్నాడు. గత నెల 28న కానిస్టేబుల్ సత్యనారాయణకి రూ.15 వేలను బాధితుడు గూగుల్ పే (Google Pay) ద్వారా పంపించాడు. ఆ మొత్తాన్ని కానిస్టేబుల్ ఎస్సైకి పంపించాడు. అయితే బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఎస్సై వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు.
SI Caught by ACB | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Hormuz LPG ships | భారత్‌కు ఊరట.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు నౌకలు

