అక్షరటుడే, వెబ్‌డెస్క్: SI Wife Suicide Case | కరీంనగర్ (Karimnagar)లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎస్సై భార్య ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ టూ టౌన్లో ఎస్సైగా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య సూసైడ్ చేసుకుంది.
SI Wife Suicide Case | టూ టౌన్ ఎస్సై భార్య..
వివరాల్లోకి వెళ్తే.. టూ టౌన్ ఎస్సై (Two Town SI) చంద్రశేఖర్ భార్య దివ్య కరీంనగర్‌లోని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గన్నేరు పప్పు దంచుకుని తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను మంగళవారం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)కి తరలించారు. కాగా.. ఎస్సై దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య..
దివ్య కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్ : మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

