అక్షరటుడే, భిక్కనూరు: Siddarameshwara Temple Closure | చంద్రగ్రహణం (Lunar Eclipse Effect) కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేశారు. హిందూ సంప్రదాయం (Temple Closure Telangana) ప్రకారం గ్రహణ కాలంలో ఆలయాలను మూసిఉంచి గ్రహణం వీడిన తర్వాత వాటిని సంప్రోక్షణ చేసి తిరిగి భక్తుల దర్శనం నిమిత్తం తెరుస్తారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలోని (Kamareddy District News) ప్రముఖ ఆలయాలను మూసి ఉంచారు.
Siddarameshwara Temple Closure | భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం..
గ్రహణం కారణంగా భిక్కనూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ద రామేశ్వరాలయాన్ని(Siddarameshwara Temple) మంగళవారం మూసివేశారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీధర్ ఆదేశాల మేరకు అనువంశ అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ, కొడకండ్ల సిద్దగిరి శర్మ, న్యాలకంటి రాజేశ్వర శర్మలు ఆలయాన్ని మూసిఉంచారు.
Siddarameshwara Temple Closure | సంప్రోక్షణ అనంతరం..
4వ తేదీ బూధవారం ఉదయం సంప్రోక్షణ(Samprokshana Rituals) అనంతరం ఆలయాన్ని(Bhikkanoor Temple News) తిరిగి భక్తుల దర్శనం కోసం తెరుస్తామని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది బల్యాల లక్ష్మీనారాయణ, కుర్మ లక్ష్మి, ఈగ లక్ష్మి, గోపి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర

