అక్షరటుడే, హైదరాబాద్ : Silica Gel Uses | మనం కొత్తగా హ్యాండ్ బ్యాగులు, స్మార్ట్‌ఫోన్లు, (Smartphones) కొత్త షూస్ లేదా కెమెరా వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు, వాటి బాక్సుల్లో చిన్న చిన్న తెల్లటి ప్యాకెట్లు కనిపిస్తుంటాయి.
అవే ‘సిలికా జెల్’ ప్యాకెట్లు. చాలామంది ఇవి దేనికి పనికిరావు అనుకుని వెంటనే డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇవి మన నిత్యజీవితంలో ఎంతో ఖరీదైన వస్తువులను పాడవకుండా కాపాడతాయి. తేమను పీల్చుకోవడంలో వీటికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. ఈ చిన్న ప్యాకెట్లతో కలిగే లాభాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
Silica Gel Uses | తేమను పీల్చి.. వస్తువులను భద్రంగా:
సిలికా జెల్ ప్యాకెట్లు ప్రధానంగా బ్యాక్టీరియాను , తేమను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన ఇంట్లోని షూ రాక్‌లు లేదా బట్టల బీరువాల్లో వీటిని ఉంచడం వల్ల, అక్కడి తేమను ఇవి గ్రహిస్తాయి. దీనివల్ల బట్టలు లేదా పాదరక్షల నుండి వచ్చే దుర్వాసన మాయమవడమే కాకుండా, చెదలు, కీటకాలు దరిచేరకుండా ఉంటాయి. బట్టలు ఎప్పుడూ తాజాగా ఉండాలంటే వీటిని వాడటం ఉత్తమ మార్గం.
Silica Gel Uses | జ్ఞాపకాలను భద్రపరిచే కవచం:
మనం ఎంతో ఇష్టంగా దాచుకున్న పాత ఫోటో ఆల్బమ్‌లు (Photo Albums) కొన్ని ఏళ్ల తర్వాత తీసి చూస్తే, వాటిపై పసుపు రంగు చారలు లేదా మరకలు కనిపిస్తుంటాయి. గాలిలోని తేమ వల్ల ఫోటోలు పాడవుతాయి. అలా కాకూడదంటే, మీ ఫోటో ఆల్బమ్‌లు ఉంచే బ్యాగులో లేదా ఫోటోల మధ్యలో రెండు సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచండి. ఇవి తేమను గ్రహించి మీ జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా ఉంచుతాయి. అలాగే మన విలువైన విద్యా ధృవీకరణ పత్రాలు (Certificates), బాండ్లు ఉంచే ఫైళ్లలో వీటిని పెడితే, కాగితాలు చెమ్మగిల్లకుండా, అక్షరాలు చెరిగిపోకుండా ఉంటాయి.

Silica Gel Uses | ఎలక్ట్రానిక్స్ , గృహోపకరణాల రక్షణ:
మనం కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను (Electronic items) అప్పుడప్పుడు మాత్రమే వాడుతుంటాం. అలాంటి వస్తువులను భద్రపరిచే బాక్సులలో ఈ సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచితే, లోపల తేమ చేరదు. ఫలితంగా సర్క్యూట్లు తుప్పు పట్టకుండా వస్తువులు దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. అంతేకాదు, తలుపుల కర్టెన్లు, టవల్స్ లేదా కాటన్ దుస్తులు నిల్వ ఉంచినప్పుడు వచ్చే ఒక రకమైన ‘ముక్కిన’ వాసన రాకుండా ఉండాలంటే, ఆ వస్త్రాల మధ్య ఈ ప్యాకెట్లను ఉంచితే సరిపోతుంది.
ఇది కూడా చదవండి..: Women Stomach Pain | మహిళల్లో కడుపు నొప్పి.. ఏ ప్రాంతంలో నొప్పి వస్తే ఏ అనారోగ్యానికి సంకేతమంటే..!

