Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Singur Dam Safety | సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలి : మంత్రులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

మెదక్ - Singur Dam Safety | సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలి : మంత్రులు

మెదక్తెలంగాణ

Singur Dam Safety | సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలి : మంత్రులు

ఉమ్మడి మెదక్​ జిల్లాలోని పాలు సాగునీటి ప్రాజెక్ట్​లపై మంత్రులు సమీక్షించారు. సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 8:34 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Singur Dam Safety

అక్షరటుడే, మెదక్​ : Singur Dam Safety | సింగూరు డ్యామ్​ సేఫ్టి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల DPR రూపొందించాలన్నారు. ఉగాదిలోగా పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు శంకుస్థాపన చేయాలని సూచించారు. సింగూర్ ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26 లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

Contents
  • Singur Dam Safety | డ్యామ్​ సేఫ్టీపై ఆందోళన
    • Singur Dam Safety | పెద్దారెడ్డి లిఫ్ట్​పై..

రాష్ట్ర సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యాం సేఫ్టీపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. మంత్రులు మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్ట్ భద్రత ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యత అంశం అన్నారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు డ్యాంను పరిరక్షించాలని ఆదేశించారు.

Singur Dam Safety | డ్యామ్​ సేఫ్టీపై ఆందోళన

సింగూరు డ్యామ్ సేఫ్టీపై ఆందోళన నెలకొని ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్​డీఎస్​ఏ (NDSA) అధికారులు ప్రాజెక్ట్​ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో నింపొద్దని ఆదేశించారు. దీంతో అధికారులు వర్షాకాలంలో పూర్తిగా నింపకుండా నీటిని వదిలేశారు. యాసంగి సీజన్​లో ప్రతి ఏడాది సింగూరు నుంచి ఘనపురం ఆనకట్ట (Ghanpur Anakatta)కు నీటిని వదులుతారు. దీని ద్వారా మెదక్​, పాపన్నపేట, కొల్చారం, హవేలి ఘన్​పూర్ (Haveli Ghanpur)​ మండలాల్లో వేల ఎకరాల పంటలు సాగు అవుతాయి. ప్రస్తుతం మరమ్మతు పనుల కోసం డ్యామ్​ను ఖాళీ చేశారు. దీంతో కాలువల ద్వారా నీటి విడుదల సైతం  చేపట్టలేదు. ఈ క్రమంలో పనులు వేగంగా పూర్తి చేసి వానాకాలం సీజన్​లో సాగు నీరు అందించాలని మంత్రులు సూచించారు.

Singur Dam Safety | పెద్దారెడ్డి లిఫ్ట్​పై..

ఆందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం DPRలను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని మంత్రులు ఆదేశించారు. ఉగాదిలోగా శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. సింగూరు కాలువల లైనింగ్ పనులను జూన్ 26లోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష

KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్​
Face Recognition Schemes | ఇకపై అన్ని పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం
Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Rohith Reddy Remand | డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​ రెడ్డి రిమాండ్​!
TAGGED:Canal lining worksDam repair worksingur Dam safetyIrrigation department reviewMedak district newsPeddareddy Lift Irrigation SchemeTelangana irrigation projects
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Holi Celebrations Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు
Next Article Kamareddy Municipal Chairperson Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?