అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sircilla Weavers Dues | సిరిసిల్ల నేత కార్మికులను విద్యుత్ సంక్షోభం నుంచి కాపాడాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ మేరకు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుని కలిసి వినతిపత్రం అందజేశారు.
నేత కార్మికుల రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ (Sircilla Textile Industry)పై ఉన్న బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందించాలన్నారు.
Sircilla Weavers Dues | బ్యాక్ బిల్లింగ్‌తో..
కార్మికులు ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కేటీఆర్ (KTR) కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడంతో పరిశ్రమ నిలదొక్కుకుందన్నారు. అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారంతో వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ (SSI) యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందన్నారు.
Sircilla Weavers Dues | మూతబడుతున్న యూనిట్లు
బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూత పడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నను ఆదుకోవాలని కేటీఆర్ కోరారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న మహిళ అరెస్ట్

